ఇక్కడ మగాళ్ళదే డామినేషన్ అని తేల్చేసింది
సినీ పరిశ్రమలో ఎప్పుడూ మగాళ్లదే డామినేషన్. హీరోయిన్ల దుస్తులకు, హెయిర్ స్టయిల్‌కు ఇచ్చిన ప్రాధాన్యం, వాళ్ల పాత్రల్ని తీర్చిదిద్దడానికి ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తోంది అమీషా పటేల్. బద్రీలో పవన్ కళ్యాణ్ సరసన, నానిలో మహేష్ సరసన చేసిన ఈ ముద్గుగుమ్మ గ్యాప్ తర్వాత బాలకృష్ణ సరసన పరమ వీర చక్ర సినిమాలో చేసింది. ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో ఇక్కడ మళ్ళీ ఆఫర్ రాలేదు. అలాగే బాలీవుడ్ లో సైతం ఆమెకు ప్రస్తుతం ఆఫర్స్ కరువయ్యాయి. హీరోయిన్ గా చేసే వయస్సు దాటిపోవటంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నూ ట్రై చేస్తోంది. కానీ వాటికి ఇంకా వయస్సు రాలేదు..సరిపోలేదు అంటున్నారు.


Click it and Unblock the Notifications











