హీరోయిన్ అమీషా పటేల్ పారిస్‌లో వేశ్యగా...

By Bojja Kumar

పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ అమీషా పటేల్. గత కొంత కాలంగా అంతంత మాత్రంగానే సాగుతున్న అమీషా కెరీర్ ఈ సంవత్సరం కాస్త జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పడు దాదాపు నాలుగైదు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం అమీషా తన తర్వాతి చిత్రంలో వేశ్య పాత్రలో దర్శనం ఇవ్వబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీషా...'పారిస్‌లో ఉండే హై ప్రొఫైల్ వేశ్య'పాత్రను పోషిస్తోంది. ఈ మేరకు పలువురు హై ప్రొఫైల్ వేశ్యలను కలుస్తూ వారి జీవితాలపై అధ్యయనం చేస్తున్నారు.

ఈ పాత్రపై అమీషా మాట్లాడుతూ...''ఇలాంటి పాత్ర చేయడం నాకు మొదటి సారి, ఈ పాత్ర చేయడంపై నేను ఎంతో ఎక్సైటెడ్‌గా ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆసక్తి కర విషయం ఏమిటంటే ఈచిత్రానికి నిర్మాత కూడా అమీషానే. తను స్థాపించిన అమీషా పటేల్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇతర ప్రొడక్షన్స్ లోనే అమీషా రెచ్చిపోయి నటించింది. మరి సొంత బ్యానర్లో, అందులోనూ వేశ్య పాత్ర, అమీషా ఏ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుందో అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. 2012 ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X