అభిషేక్ బచ్చన్ కి 12 ఏళ్ళ కుమారుడు!?
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు మరో సరికొత్త గెటప్‌లో ప్రేక్షకులను కనువిందు చేయబోతున్నాడు. ఓ వ్యాధి వలన ముప్పైతొమ్మిదేళ్ళ వాడిలా కనించే పాత్ర అది. అది కూడా అభిషేక్ బచ్చన్ కొడుకుగా నటించడం విశేషం. ఈ ఇంట్రస్టింగ్ మావీ బాలకృష్ణన్ దర్శకత్వంలో వస్తుంది. నిశ్శబ్ద్, చీనీకమ్ వంటి డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్‌బి ఇప్పుడు పన్నెండేళ్ళ చిన్న పిల్లాడిలా కనించబోతున్నాడు. 'పా' అనే సినిమాలో అతనిది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఈమూవీలో అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ వారిద్దరి ముద్దుల కొడుకుగా యాక్ట్ చేస్తున్నాడు.
అయితే ఇందులో వున్న వెరైటీ ఏంటంటే, ప్రొగేరియా అనే వ్యాధి వలన పన్నెండేళ్ళ వయసులో కూడా ముప్పైతొమ్మిదేళ్ళవాడిలా కనిపిస్తాడు. కాని అతని ప్రవర్తన మాత్రం చిన్న పిల్లాడిలానే వుంటుందన్నమాట. చిన్న పిల్లలతో అతని ప్రవర్తన ఎలా స్కూలుకు వెళ్ళతాడు, ఎలా చదువుతాడు అనే దానిపై మొత్తం కథాంశం వుంటుంది. ఈ మూవీకి సంబంధించి బిగ్‌బి మేకప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముప్పై తొమ్మిదేళ్ళ వాడిగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమా ప్రచారానికి సంబంధించిన విషయాలు ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ చూసుకుంటోంది. ఈ మూవీ బిగ్ బి కి బిగ్ సక్సస్‌ను అందించాలని ఆవిడ ఆకాంక్ష అట. ఈ డిఫరెంట్ థింకింగ్ తనదేనని, ఇంట్లో చిన్న పిల్లలను చూసి ఈ క్యారెక్టర్ చేయాలని నిర్ణయించుకున్నానని బిగ్‌బి చెప్తున్నాడు. అయితే ఇలాంటి స్టోరీ లైన్‌తోనే హాలీవుడ్‌లో జాక్ అనే సినిమా వుంది. ఇందులో బిగ్‌బి పాత్రనే బాలీవుడ్ హీరో రాబిన్ విలియమ్స్ పోషించాడు. ఈమూవీలో కూడా రాబిన్ యునెక్యూ ఏజింగ్ డిజార్డర్ వుండటంతో, చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తుంటాడు. పదేళ్ళ వయసులో నలభై ఏళ్ళ పిల్లాడిలా కనిపిస్తాడు. ఏది ఏమైన ఢిఫరెంట్ లైన్‌తో వస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











