మలయాళం సిన్మాలో మోహన్ లాల్ తో అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మలయాళం సినిమాలో నటించనున్నారు. కాందహార్ విమాన హైజాక్ కథనంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో కలిసి ఆయన నటించనున్నారని చిత్ర దర్శకుడు మేజర్ రవి తెలిపారు. ఈ మేరకు అమితాబ్‌తో చర్చలు ముగిశాయని సోమవారం ఆయన పీటీఐతో చెప్పారు. ఈ చిత్రానికి 'కాందహార్' అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అమితాబ్ బచ్చన్ వీలును బట్టి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు.
దేశంలో మలయాళం చిత్రాలకు కథా పరంగా నాణ్యత ఎక్కువని అమితాబ్ బచ్చన్ ఇటీవల అన్నారు. మోహన్ లాల్ సహజ నటుడని, ఆయన కలిసి నటించడం అదృష్టమని బిగ్ బి అన్నారు.
అమితాబ్ బచ్చన్ మోహన్ లాల్ బాలీవుడ్ మేజర్ రవి కాందహార్ amitabh bachchan mohan lal bollywood major ravi kandahar


Click it and Unblock the Notifications