వెన్నెల కిశోర్‌కు మెగాస్టార్ షాక్: ఒక్కసారిగా గుండె దడ పెరిగిందట..

ఇండియన్ సినిమా బ్లాక్&వైట్ నుంచి ఈస్ట్ మన్ కలర్‌కు మళ్లుతున్న రోజుల్లోనే సినీ 'లెజెండ్'గా పేరు తెచ్చుకున్నారు అమితాబ్ బచ్చన్. భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మన తెలుగులోనూ అమితాబ్‌ను విపరీతంగా ఆరాధించే నటులు లేకపోలేదు. రవితేజ లాగే హాస్యనటుడు వెన్నెల కిశోర్ కూడా ఈ ఇండియన్ మెగాస్టార్‌కి బిగ్ ఫ్యాన్.. అలాంటి ఫ్యాన్‌కు ఇప్పుడు పెద్ద షాకే తగిలింది..

వెన్నెల కిశోర్ షాక్:

దేశంలోనే ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన ఉన్నవారిలో తొలిస్థానంలో ఉన్నారు అమితాబ్. 32,902,353 మంది ఆయన్ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. అందులో టాలీవుడ్ హాస్య నటుడు వెన్నెల కిశోర్ కూడా ఒకరు. అయితే తన ఆరాధ్య నటుడు ట్విట్టర్‌లో తనను ఫాలో అవుతున్నట్లు నోటిఫికేషన్ రావడంతో వెన్నెల కిశోర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

గుండె దడ పెరిగిందట..:

గుండె దడ పెరిగిందట..:

అమితాబ్ లాంటి స్టార్ తనను ఫాలో అవడం వెన్నెల కిశోర్‌ను ఒకింత ఆనందంలోనూ ఒకింత ఆశ్చర్యంలోనూ పడేసింది. అందుకే ఆ షాక్‌లో ఎలా స్పందించాలో తెలియక.. సర్‌ప్రైజ్ ఎక్స్‌ప్రెషన్ తో కూడిన ఎమోజీలను పదుల సంఖ్యలో పోస్ట్ చేసి.. గుండె దడ పెరుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

అమితాబ్ సంచలన ప్రకటన:


తాను ట్విట్టర్ నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందంటూ బుధవారం రాత్రి అమితాబ్ చేసిన ట్వీట్ చాలామందిని షాక్ కు గురిచేసింది. దేశంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఉన్నవారిలో ముందువరుసలో ఉన్న అమితాబ్.. ఉన్నట్టుండి ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అమితాబ్ ఏమన్నారు?:

అమితాబ్ ఏమన్నారు?:

'ట్విటర్‌??.. నువ్వు నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించావు.. ఇది చాలా హాస్యాస్పదం. ఇక నీ నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. బయట మరిన్ని ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. థ్యాంక్యూ..' అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.

Recommended Video

Vennela kishore Speech @ Ungarala Rambabu Pre Release Event |
అమితాబ్ కంటే షారుఖ్..:

అమితాబ్ కంటే షారుఖ్..:

ట్విటర్‌‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న సెలబ్రిటీగా ఇన్నాళ్లు తొలి స్థానంలో ఉన్నారు అమితాబ్‌. అమితాబ్ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ‍్య 32,902,353. ఇప్పుడు అమితాబ్‌ ను షారూఖ్‌ దాటేశారు. 32,944,338 ఫాలోవర్స్‌ తో షారూఖ్‌ఖాన్‌ తొలి స్థానంలో నిలిచారు. దీంతో ట్విటర్‌ ఉద్దేశపూర్వకంగానే తన ఫాలోవర్స్‌ను తగ్గించిందన్నట్టుగా అమితాబ్‌ ట్వీట్‌ చేశారు.

నిజంగానే తప్పుకున్నారా?:

నిజంగానే తప్పుకున్నారా?:

అమితాబ్ ట్విట్టర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారా?.. లేక నిజంగానే ట్విట్టర్ నుంచి క్విట్ అయ్యారా? అనేది అర్థం కావడం లేదు. ట్విట్టర్ ను వీడుతున్నట్లు ప్రకటించిన తర్వాత.. మళ్లీ ఆయన నుంచి ఎలాంటి ట్వీట్ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X