రజనీకాంత్‌పై జోకుని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్
గ్రాహంబెల్ టెలిఫోన్ కనిపెట్టిన ఆనందంలో గట్టిగా అరిచాడు. సరిగ్గా అప్పుడే ట్రింగ్.. ట్రింగ్‌మని ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తితే 'కంగ్రాట్స్.. ఫోన్ కనిపెట్టారట..' అని అవతల రజనీకాంత్ నుంచి ఫోను. అంటే గ్రాహంబెల్ కన్నా ముందే రజనీ టెలిఫోన్ కనిపెట్టారన్నమాట. - దక్షిణాదిన రజనీకాంత్‌పై ఇలాంటి సరదా జోకులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి సరదా సంక్షిప్త సందేశాలు ప్రతి రోజూ సెల్‌ఫోనుల్లో షికారు చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా రజనీ ఎస్సెమ్మెస్‌లకు ఆదరణ పెరిగింది.
ఇది ఎంత వరకూ చేరిందంటే అమితాబ్‌బచ్చన్‌కీ ఇలాంటి జోకు అందింది. ఆయన వెంటనే తన ట్విట్టర్‌లో పెట్టేశారు. దాంతో రజనీ అభిమానులు ఖంగు తిన్నారు. దీనిపై బిగ్ బీకి ట్విట్టర్‌లో సందేశం పంపారు. వెంటనే అమితాబ్ స్పందించారు. ''రజనీ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో గౌరవం కూడా. తనని విమర్శించాలని ఈ జోకు ట్విట్టర్‌లో ఉంచలేదు. ఆ ఎస్సెమ్మెస్‌లో రజనీ గొప్పదనాన్ని అంతర్లీనంగా చెప్పారు. నిజంగా రజనీ చాలా గొప్పవాడు. ప్రేమకు తప్ప అన్నింటికీ అతీతుడు..'' అని రజనీని మెచ్చుకొన్నారు.


Click it and Unblock the Notifications











