twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా జీవితంలోనేకాదు నిజజీవితంలోనూ ఆదర్శప్రాయుడు సూపర్ స్టార్

    By Sindhu
    |

    నేను పెరిగిన వాతావరణంలో కులమతాలకు ప్రస్థావనే లేదు అంటున్నారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్. ప్రకాష్ ఝూ దర్శకత్వంలొ రూపొందిన 'అరక్షణ్' చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 12 న ఈ చిత్రం విడుదలకానుంది.విధ్యా సంస్థలలొ కులాలకు సంబందించిన రిజర్వేషన్ లపై ఈ సినిమా కథ సాగుతుంది.ఈ సినిమా గురించి అమితాబచ్చన్ మాట్లాడుతూ ఈ సినిమాలొ నేను ఓ కళాశాల ప్రిన్సిపాల్ గా కనిపిస్తాను.కులం ఆధారంగా రిజర్వేషన్ లు ప్రోత్సహిస్తే సమాజంలో వచ్చే మార్పులు ఎలా వుంటాయి ?రిజర్వేషన్ ల వ్యవస్థ తాలూకు మూలం ఏమిటి ? వాటికి నేటి పరిస్థితులు అనుకూలమా ?ప్రతికూలమా ?అనే అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకొందని తెలిపారు.

    తన నిజ జీవితంలో కులాలప్రస్థావన రాగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'కులాల గురించి నాకేం తెలియదు.నేను పెరిగిన వాతావరణం అలాంటిది.మా నాన్న గారు మాదగ్గర ఎప్పుడూ కులాల గురించి ప్రస్థావన తీసుకురాలేదు.వాస్థవానికి అయన చేసుకొన్నది కులాంతర వివాహమే. మానాన్న హరివంశ్ రాయ్ బచ్చన్ ఓ సిక్కు వనితను పెళ్ళి చేసుకొన్నారు. నేనేమో బెంగాలీ వనితను వివాహమాడితే మా అబ్బాయి అభిషేక్ బచ్చన్ కన్నడ అమ్మాయిని వివాహమాడాడు.అలాగే మా అమ్మాయి పంజాబీ అబ్బాయిని పెళ్ళి చేసుకొన్నారు.ఇలా మా కుటుంబంలొ కులానికి అస్సలు పట్టింపు లేదని తెలిపారు.

    English summary
    Director Prakash Jha's next film Aarakshan (reservation), starring Amitabh Bachchan, Saif Ali Khan and Deepika Padukone has yet again got into a controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X