Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ ‘జంజీర్’ ట్రైలర్‌పై అమితాబ్ కామెంట్స్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్లో 'జంజీర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ట్రైలర్ చూసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'జంజీర్' చిత్రాన్ని డైనమిక్ గా తెరకెక్కిస్తున్నారని వ్యాఖ్యానించారు. దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'జంజీర్' చిత్రానికి అమిత్ మిశ్రా నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు.
ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రియల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు.