అమితాబ్, అభిషేక్ కరోనావైరస్.. చిరు, మహేష్, నాగ్, సినీ ప్రముఖుల ఆందోళన

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనావైరస్ బారిన పడ్డారనే వార్త బయటకు రాగానే దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. శనివారం రాత్రి స్వయంగా అమితాబ్ ట్వీట్ చేసి తనకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారు 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Amitabh Bachchan and Abhishek tested corona positive

అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్‌కు తరలించారు. నా కుటుంబ సభ్యులు, స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ జరిపించుకోవాలని హస్పిటల్ వర్గాలు సూచించాయి. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ దయచేసి వారంతట వారే పరీక్షలు నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను అని అమితాబ్ సూచించారు.

అభిషేక్ బచ్చన్ తనకు కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయాన్ని తెలియజేస్తూ.. శనివారం ఉదయమే నాకు, నాన్నకు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. మాకు స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు ఉండటంతో హాస్పిటల్‌లో చేరాం. మాకు కోవిడ్ అనే విషయాన్ని ప్రభుత్వ, వైద్య అధికారులకు తెలియజేశాం. దాంతో నా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరినీ టెస్ట్ చేశారు. మా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందకూడదని మనవి చేస్తున్నాను అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమితాబ్‌, అభిషేక్‌కు కరోనావైరస్ అని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, సోనుసూద్, లారాదత్తా, తాప్సీ, నేహా దూపియా, దర్శకుడు గుణశేఖర్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

చిరంజీవి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అమిత్ జీ మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మీరు త్వరగా తిరిగి రావాలని భగవంతుడిని వేడుకొంటున్నాం అని అని ట్వీట్ చేశారు.

మహేష్ బాబు స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలి సార్. మీరు క్షేమంగా త్వరగా తిరిగి రావాలని కోరుకొంటున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నాగార్జున ట్వీట్ చేసి త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నాం. మీరు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని కోరుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X