ఆసుపత్రిలో మెగాస్టార్.. వైరల్ అవుతున్న వార్తలు.. ఇదీ అసలు మ్యాటర్!

బిగ్ బీ, బాలీవుడ్ మెగాస్టార్ ఓ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ తెరపై టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన వయసు 77 సంవత్సరాలు. అయితే ఇటీవలే ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఆ కారణంగా ఆసుపత్రిలో చేరారని వార్తలు గుప్పుమంటున్నాయి. పూర్తి వివరాలు చూస్తే..

కాలేయ సంబంధిత వ్యాధి.. ముంబై హాస్పిటల్‌లో

కాలేయ సంబంధిత వ్యాధి.. ముంబై హాస్పిటల్‌లో

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారని, ఆ కారణంగానే ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చేరినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లుగా తెలుస్తోంది.

వైద్యులే స్వయంగా చెప్పడంతో..

వైద్యులే స్వయంగా చెప్పడంతో..

అమితాబ్ ఫుల్ బాడీ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా నానావతి ఆసుపత్రి వైద్యులు చెప్పారని తెలిసింది. ఈ మేరకు అమితాబ్‌ను విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయం తెలిసి అమితాబ్ అభిమాన వర్గాలు ఆయన ఆరోగ్యం బాగుండాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.

 స్వయంగా అమితాబ్ ప్రకటన

స్వయంగా అమితాబ్ ప్రకటన

తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో అమితాబ్ ఆరోగ్య పరిస్థితి హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో చాలా ఏళ్ల క్రితం కూడా ఇలాగే

గతంలో చాలా ఏళ్ల క్రితం కూడా ఇలాగే

1982 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ 'కూలీ' షూటింగ్ సినిమా సమయంలో ఇలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు అమితాబ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. కాలేయ సంబంధిత వ్యాధికి గురి కావడమే ఆయన హాస్పిటల్‌లో చేరడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

గతంలో చాలా ఏళ్ల క్రితం కూడా ఇలాగే

గతంలో చాలా ఏళ్ల క్రితం కూడా ఇలాగే

1982 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ 'కూలీ' షూటింగ్ సినిమా సమయంలో ఇలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు అమితాబ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. కాలేయ సంబంధిత వ్యాధికి గురి కావడమే ఆయన హాస్పిటల్‌లో చేరడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

అమితాబ్ సినీ జర్నీ

అమితాబ్ సినీ జర్నీ

అమితాబ్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్ పతి' అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన తాజా సినిమాలు 'గులాబో సితాబో, జుంద్, చెహ్రీ, బ్రహ్మాస్త్ర చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ తెరపై కూడా ఆయన కాలుమోపిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X