చిరు ఆహ్వానాన్ని మన్నించిన అమితాబ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిశ్చితార్థం తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనితో డిసెంబర్ 1న జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరు కానున్నారు. వీరిలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. మెగాస్టార్ పంపిన నిశ్చితార్థ ఆహ్వానాన్ని మన్నించిన అమితాబ్ ఆ వేడుకకు తప్పకుండా హాజరువుతానని మాటిచ్చారని తెలిసింది.
అయితే ఈ వేడుకకు మెగా అభిమానులు, సామాన్య జనాలకు ప్రవేశం లేదని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా వీవీఐపీలు ఈ నిశ్చితార్థ మహోత్సవానికి హాజరువుతున్న నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పోతే నిశ్చితార్థ రోజున చరణ్ కు అత్తింటి వారు ఓ చార్టెడ్ ఫ్లైట్ ను కానుకగా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో నిశ్చితార్థం పూర్తయితేగానీ తెలియదు. ప్రస్తుతం చరణ్ రచ్చ షూటింగులో భాగంగా చైనాలో ఉన్నాడు. ఈ వారాంతంలో అతడు హైదరాబాద్ తిరిగి రానున్నాడు.


Click it and Unblock the Notifications











