రామ్ చరణ్ బర్త్ డే: అమితాబ్ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్... విష్ చేసిన ఎన్టీఆర్, సినీ స్టార్లు!

Recommended Video

Celebrities Birthday Wishes To Ram Charan | Amitabh Bachchan | Jr NTR | Varun Tej | Rana Daggubati

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు(మార్చి 27) తన 34వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెర్రీని విష్ చేస్తూ ఓ వీడియో సందేశం పంపారు. దాన్ని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

''మీరు(అమితాబ్) విష్ చేయడం మాకు గొప్ప బహుమతి. చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఆనందంతో నా చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. హ్యాపీ బర్త్ రామ్ చరణ్, లవ్ యూ.'' అని ఉపాసన వ్యాఖ్యానించారు. తన వీడియో సందేశంలో రామ్ చరణ్ గురించి అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమితాబ్ బచ్చన్ నుంచి సర్‌ప్రైజ్ విషెస్

‘‘నువ్వు మరిన్ని విజయాలు అందుకుంటూ ముందుకు సాగాలని నేను మాత్రమే కాదు.. ముంబైలోని మా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోంది. నువ్వు అద్భుతమైన వ్యక్తి. నీ వయసు ఎంతో నాకు తెలియదు. కానీ నిన్ను చూసినప్పుడల్లా 18 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తావు. నీ మాతృభాషలో కూడా విష్ చేయాలనుకుంటున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్' అని అమితాబ్ పేర్కొన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్

రామ్ చరణ్‌ను విష్ చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. ‘‘హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్. ఈ ఏడాది నీకు మరింత ఎక్కువ విజయం కలిసి రావాలి. నీలోని చిన్నపిల్లాడిని అలాగే కొనసాగించు. ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్'' అని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరూ కలిసి ధృవ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

తమ్ముడి చిన్ననాటి ఫోటో షేర్ చేసిన సుష్మిత

రామ్ చరణ్ సోదరి సుస్మిత ట్వీట్ చేస్తూ... తన తమ్ముడి చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు. తనలో సంతోషం, శాంతి ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

లవ్ యూ అన్నా

వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా విష్ చేస్తూ.. ‘నా ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని వ్యాఖ్యానించారు.

సాయి ధరమ్ తేజ్

రంగస్థలం సెట్స్‌లో రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్టీఆర్ విషెస్

రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్... చెర్రీని విష్ చేస్తూ ట్వీట్ చేశారు.

రానా దగ్గుబాటి

హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్ అంటూ..తన చిన్ననాటి స్నేహితుడిని రానా విష్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X