నాగార్జునతో మెగాస్టార్: మళ్ళీ ఆనాటి క్రేజీ కాంబో, ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ఖుదాగవా రోజుల నుంచి నాగ్-అమితాబ్ ల మధ్య స్నేహం ఉండగా.. రీసెంట్ గా మనం చిత్రంలో కూడా బిగ్ బీ మెరిసిన సంగతి తెలిసిందే. ఇక సర్కార్ సిరీస్ తో పాటు పలు చిత్రాలను అమితాబ్ తో తెరకెక్కించిన వర్మ..
Recommended Video

బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో అప్పుడప్పుడూ కనిపించటం మామూలే... గతంలో చంద్రలేఖ సినిమాలో సంజయ్ దత్ కనిపించాడు, మరో సినిమాలోనూ అమితాబ్ కూడా కనిపించాడు, ఇక బాలీవుడ్ భామల ఐటం సాంగ్స్ మనకు సర్వసాధారణం అయిపోయింది...

ఆ ప్రాజెక్టే ఆగిపోయింది
ఆ మధ్య కృష్ణవంశి, నందమూరి బాలకృష్ణల కాంబినేషన్ లో ప్లాన్ చేసిన రైతు సినిమాలో అమితాబ్ బచ్చన్ తో ఒక పాత్ర వేయించాలని ట్రై చేసారు కాకపోతే అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టే ఆగిపోయింది ఆతర్వాత ఇప్పుడు మెగాస్టార్ సినిమా సైరాలోనూ అమితాబ్ నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్న సమయం లో ఇంకో న్యూస్ వచ్చింది. మెగాస్టార్ తోనే కాదు నాగార్జునతోనూ కలిసి నటించబోతున్నాడట బిగ్ బీ

అమితాబ్ బచ్చన్
ఈ మూవీతో వర్మ మళ్లీ తన సత్తా చాటుతాడని నాగార్జున ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించేస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ఓ కీలకమైన పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటు నాగార్జునకు.. అటు రాంగోపాల్ వర్మకు.. ఇద్దరికీ అమితాబ్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.

సర్కార్ సిరీస్ తో పాటు
ఖుదాగవా రోజుల నుంచి నాగ్-అమితాబ్ ల మధ్య స్నేహం ఉండగా.. రీసెంట్ గా మనం చిత్రంలో కూడా బిగ్ బీ మెరిసిన సంగతి తెలిసిందే. ఇక సర్కార్ సిరీస్ తో పాటు పలు చిత్రాలను అమితాబ్ తో తెరకెక్కించిన వర్మ.. ఇప్పుడు నాగ్ తో తను రూపొందించనున్న మూవీలో ఓ అతిథి పాత్ర చేయాల్సిందిగా అమితాబ్ ను కోరాడట.

యాక్షన్ ఓరియెంటెడ్
ఇదే విషయంపై నాగార్జున కూడా పర్సనల్ గా అమితాబ్ తో డిస్కషన్స్ చేశాడని తెలుస్తోంది. బచ్చన్ సాబ్ నుంచి కూడా ఈ క్యామియో రోల్ కు సానుకూల స్పందన వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కే ఈ చిత్రంలో.. నాగార్జున పోలీసు పాత్రలో కనిపించనుండగా.. అమితాబ్ కు ఎలాంటి రోల్ ఆఫర్ చేశారనే ఆసక్తి పెరిగిపోతోంది.

10 రోజుల తర్వాత
ఈ చిత్రం షూటింగ్ 10 రోజుల పాటు చేసిన తర్వాత.. బ్రేక్ తీసుకుని.. తన కుమారుడు అఖిల్ నటించిన హెలో మూవీ పనుల్లో బిజీ అవుతానని.. నాగార్జున స్వయంగా చెప్పారు. సో..! మరోసారి ఖుదాగవా లాంటి సూపర్ సినిమా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా??


Click it and Unblock the Notifications











