twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతన్ని ఉరి తీయడంపై అమితాబ్ బచ్చన్ ఆనందం

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: జైషే మహ్మద్ తీవ్రవాది అప్జల్ గురుకు ఉరి శిక్ష అమలు చేయడంపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి వారిని శిక్ష పడటంతో న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం మరింత పెరిగిందని 70 ఏళ్ల అమితాబ్ చెప్పుకొచ్చారు. పార్లమెంటు దాడికి కుట్ర చేసినందుకుగాను అప్జల్ గురును శనివారం ఉదయం ఉరితీసిన సంగతి తెలిసిందే.

    డిసెంబర్ 13, 2001వ సంవత్సరంలో పార్లమెంటు పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారి అయిన అప్జల్ గురుకు 2002 డిసెంబర్ 18వ తేదీన ఢిల్లీ కోర్టు అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు 2003 అక్టోబర్ 29వ తేదీన సమర్థించింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా అతనికి ఉరిశిక్ష వేయడాన్ని సమర్థించింది. 2006 అక్టోబర్ 20వ తేదీన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండింది.

    అయితే, అతని భార్య రాష్టపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో అది ఆగిపోయింది. ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత అఫ్జల్ గురును ఉరి తీయాలనే డిమాండ్ ‌తీవ్రత పెరిగింది. 2011 ఆగస్టులో హోం మంత్రిత్వ శాఖకు మెర్సీ పిటిషన్ సిఫార్సును పంపించారు.

    పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ముగిసిన తర్వాత అఫ్జల్ గురు ఫైల్‌ను పరిశీలిస్తానని 2012 డిసెంబర్ 10వ తేదీన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు డిసెంబర్ 22వ తేదీన ముగిశాయి. అఫ్జల్ గురును ఉరి తీయాలని సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2013 జనవరి 23వ తేదీన ఫైల్ చేరింది. ఆ సిఫార్సును ఆమోదిస్తూ రాష్ట్రపతి 2013 జనవరి 26వ తేదీన సంతకం చేశారు.

    English summary
    Afzal Guru, the main accused in the Parliament attack case of December 13, 2001 was hanged in Delhi's Tihar jail on Saturday, Feb 9. He was a Jaish-e-Mohammad terrorist. Bollywood megastar Amitabh Bachchan welcomed the news. The 70-year-old veteran said that it was important to follow law and order.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X