చిరంజీవి పొలిటికల్ జర్నీపై బిగ్ బీ కామెంట్స్.. అంతమాట అనేశాడుగా!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాను చిరంజీవికి ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుండేవాడినని, అయితే ఓ విషయంలో చిరంజీవి తన సలహా పట్టించుకోలేదని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ అన్నారు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ చిరుపై అమితాబ్ చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

తొలిసారి తెలుగు తెరపై బిగ్ బీ

తొలిసారి తెలుగు తెరపై బిగ్ బీ

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ఆయన తెలుగు తెరపై దర్శనమీయనున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో తెలుగు ఆడియన్స్‌లో ఓ రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. సరిగ్గా ఈ తరుణంలో చిరుపై బిగ్ బీ చేసిన కామెంట్స్ సెన్సేషన్ అవుతున్నాయి.

జోరుగా సైరా ప్రమోషన్స్.. భాగమవుతున్న బడా స్టార్స్

జోరుగా సైరా ప్రమోషన్స్.. భాగమవుతున్న బడా స్టార్స్

సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపడుతోంది చిత్రయూనిట్. పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ ప్రమోషన్స్‌లో భాగమవుతుండటం విశేషం.

అమితాబ్ బచ్చన్, చిరంజీవి

అమితాబ్ బచ్చన్, చిరంజీవి

ఈ నేపథ్యంలోనే తాజాగా ‘సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా హిందీ వెర్షన్‌‌కు నిర్మాతగా వ్యవహరించిన ఫర్హాన్ అఖ్తర్.. అమితాబ్ బచ్చన్, చిరంజీవిలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ సైరాకు సంబంధించి, అలాగే తమ రిలేషన్‌కి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

అక్కడే కలిశాం.. అప్పటి నుంచే

అక్కడే కలిశాం.. అప్పటి నుంచే

చిరంజీవితో స్నేహం 'హమ్' సినిమా షూటింగ్ సమయంలో మొదలైందని అమితాబ్ చెప్పారు. ఆ సినిమా షూటింగ్ ఊటీలో జరగుతుండగా అదే సమయంలో చిరంజీవి సినిమా కూడా అక్కడే షూటింగ్ జరుగుతుండటంతో ఇద్దరం బాగా క్లోజ్ అయ్యామని పేర్కొన్నారు. అప్పటి నుంచి తమ స్నేహం కంటిన్యూ అవుతోందని, ఇప్పుడు ఇద్దరం కలిసి సైరా రూపంలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని అమితాబ్ అన్నారు.

ఎంత చెప్పినా చిరనేజీవి వినలేదు.. పైగా

కాగా ఈ సందర్బంగా అమితాబ్ పేర్కొన్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. చిరంజీవికి తాను ఎన్నో సలహాలు ఇచ్చానని, కానీ ఆయన పాటించలేదని అమితాబ్ చెప్పడం. అప్పట్లో తాను రాజకీయాల్లోవెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదర్కున్నానని, నా లాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని చిరుకు కూడా రాజకీయాల్లోకి వెళ్లొద్దని సలహా ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ చిరు తన మాట వినలేదని అమితాబ్ చెప్పడం ఆసక్తికర అంశంగా మారింది.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

ఇక అమితాబ్, చిరంజీవి కలిసి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా విషయానికొస్తే.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాణంలో 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X