twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను అప్పుడు తప్పు చేశాను: అమితాబ్

    By Srikanya
    |

    ముంబై: దాదాపు ఎనిమిదేళ్లనాడు చేసిన చిత్రంలో దొర్లిన తప్పును గుర్తు చేసుకొంటుంటే తానో సాధారణ నటుణ్ని అనిపిస్తోందన్నారు అమితాబ్‌ బచ్చన్‌. బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన అమితాబ్ ఎప్పటికప్పుడు తనలోని నటుడ్ని సమీక్షించుకుంటూ ముందుకుసాగుతూంటారు. తప్పు ఒప్పొప్పులన్ని బేరేజు చేసుకుంటూ మరింత పరిణితితో కూడిన నటనను అందించటానికి ఆయన ప్రయత్నిస్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన బ్లాక్ సినిమాలో జరిగిన చిన్న తప్పును గుర్తు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు.

    2005లో వచ్చిన 'బ్లాక్‌' సినిమాలో దేవరాజ్‌ సహాయ్‌ అనే పాత్రలో జీవించారు అమితాబ్‌. ఈ సినిమాలో ఆయన అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుడిగా కనిపిస్తారు. ఆ చిత్రంలో నటనకుగాను అమితాబ్‌ జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం అందుకొన్నారు. అయితే ఆ సినిమాలో తానో తప్పు చేశాననీ, అదేమిటో చెప్పగలరా అంటూ తన బ్లాగ్‌లో అభిమానుల్ని ప్రశ్నించారు బిగ్‌ బి. ఆ తరవాత తానే ఆ తప్పుని వెల్లడించారు.

    అమితాబ్ మాట్లాడుతూ...''చిత్రంలో చెవిటి, మూగ అమ్మాయి పాత్ర పోషించిన రాణీముఖర్జీకి ఉపాధ్యాయుడిగా నటించాను. ఆ తరవావాత అల్జీమర్స్‌ వ్యాధిగ్రస్తుడినవుతాను. ఒక సన్నివేశంలో రాణీముఖర్జీ - బల్లపై ఒక ఉత్తరం ఉంచుతుంది. అది చదవడం కోసం నా చేత్తో నేరుగా జేబులో ఉన్న కళ్ల జోడు తీసి చదువుతాను. నిజానికి నేను అలా చేయకూడదు. ఎందుకంటే ఆ పాత్ర స్వభావం ప్రకారం, వ్యాధి తాలూకు లక్షణాల్ని కళ్లజోడు వెదుక్కొనే క్రమంలోనూ చూపించాలి. అలా చేయలేదు. ఎనిమిదేళ్లయినా ఆ సన్నివేశం చూసినా, గుర్తుకొచ్చినా నేనూ సాధారణ నటుణ్నే కదా అనిపిస్తోంది. ఆ ఒక్క సన్నివేశం ఎంతో అసంతృప్తి కలిగించింది''అన్నారు.

    English summary
    He writes, “Black revolves around a blind and deaf girl, played by Rani Mukherjee, and her relationship with my character Sahay, her teacher, who develops Alzheimer’s. When I inform at the table that Rani had dictated a letter to me to be read at the table, especially for her sister, I took out the letter to read, and then my hand went straight to my upper pocket of the jacket to pull out the glasses to read... Mistake. I needed to feel around in my other pockets to ascertain where my glasses were, instead of my hand directly going to the pocket. For someone who is soon getting into the symptoms of Alzheimer, where patients forget where and what they do, it was incorrect of me to go straight to my pocket.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X