Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షారూఖ్ 'రావన్' ని తిడుతూ అమితాబ్
షారూఖ్ ఖాన్ తాజా చిత్రం రావన్ చాలా చెత్తగా ఉందని,అస్సలు షారూఖ్ కి నటన రాలేదని ఇలా పిచ్చి పిచ్చిగా అమితాబ్ ట్విట్టర్ లో ఆడిపోసుకున్నారని బాలీవుడ్ మొత్తం మాట్లాడుకుంది.అయితే ట్విస్ట్ ఏమిటంటే...అమితాబ్ ఫేక్ ఐడిని క్రియేట్ చేసి అలా షారూఖ్ ఖాన్ రావన్ పై దాడి చేసారట. దాంతో అమితాబ్ చాలా భాధపడుతూ తన ట్విట్టర్ లో ఇలాంటి ఫేక్ ట్వీట్స్ నమ్మవద్దన,తన ఐడిని జాగ్రత్తగా చూసుకుని ఫాలో అవమని విజ్ఞప్తి చేసారు. అలాగే బెస్ట్ విషెష్ ని షారూఖ్ కి తెలియచేసారు. అలాగే తాను ఆ ఎక్కౌంట్ ఎవరు ఓపెన్ చేసారో తప్పకుండా పట్టుకుంటానని,తాను ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇక అమితాబ్ కి టైమ్ ఏమీ బాగున్నట్లు లేదు.
తాజాగా ఆయన తనను లైంగికంగా వేధించాడని బాలీవుడ్ హీరోయిన్ సయీలీ భగత్ కూడా ఆరోపణలు చేసింది. ఆమె ఆయన తన వెనక భాగాన్ని ప్రెస్ చేసారంటూ మీడియాకు ప్రెస్ నోట్లు పంపింది. ప్రస్తుతం అమితాబ్...రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ లో చేస్తున్నారు. అందులో ఆయన రిటైరైన గ్యాంగస్టర్ గా కనపించనున్నారుఇక రావన్ విషయానికి వస్తే ఆ చిత్రం భాక్సాఫిస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఓ పిల్లల చిత్రంగా ఈ సూపర్ మ్యాన్ కాన్సెప్టు పేరు తెచ్చుకోవటం సినిమాని దెబ్బతీసింది.