»   » శవంతోనూ సెల్ఫీలు... ఫీలైన మెగా స్టార్

శవంతోనూ సెల్ఫీలు... ఫీలైన మెగా స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ''మరణించినవారికీ మర్యాద ఇవ్వడం లేదు.. వాళ్ల అంత్య క్రియలను దగ్గరుండి చేయడానికి హాజరయ్యే బతికున్నవాళ్లకీ మర్యాద లేదు. సమయం, సందర్భం కూడా పట్టించుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడటం దారుణం'' అని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఈ మాటలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా పంచుకున్నారు. ఆయన ఏమన్నారో చూడండి.

FB 1008 - My dear friend passed away suddenly .. was chatting and suddenly gone !! Fragility of life ..Went for the...

Posted by Amitabh Bachchan on 3 July 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అమితాబ్ ఇలా ఆవేదన చెందటానికి కారణం రీసెంట్ గా జరిగిన సంఘటనే. ఇటీవల స్నేహితుడు చనిపోతే, అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి అమితాబ్ ఢిల్లీ వెళ్లారు.ఇది హఠాన్మరణం అని, అస్సలు ఊహించలేదని ఈ సందర్భంగా బిగ్ బి పేర్కొన్నారు.

అయితే స్నేహితుడు చనిపోయిన బాధలో ఉన్న ఆయన్ను మరో విషయం విపరీతంగా బాధపెట్టింది. అంతిమక్రియల్లో పాలుపంచుకోవడానికి వెళ్లిన అమితాబ్‌తో సెల్ఫీలు దిగడానికి చాలామంది ఎగబడటమే బాధించిందని అన్నారు.

ఇక రీసెంట్ గా...

Amitabh Bachchan: Disgusting to take selfies at cremation

బాలీవుడ్ ప్రముఖుడు, బిగ్ బి అమితాబ్ ‘బాహుబలి' చిత్రంపై ప్రశంసలు గుప్పించడంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేసాడు. ఆయనకు థాంక్స్ చెప్పారు. అమితాబ్ బచ్చన్‌జీకి పెద్ద థాంక్స్. ఆయన నుండి అలాంటి పొగడ్తలు వినడంతో బాహుబలి టీం ఇంకా షాక్‌లో ఉంది. మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అమితాబ్ ఏమన్నారంటే... ‘బాహుబలి' తెలుగు సినిమా ఏమాత్రం కాదు, ఇది ప్రపంచ స్థాయి సినిమా అని అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి విజువల్స్ తానెపుడూ చూడలేదని, ఇలాంటి సినిమాలో తనకు అవకాశం రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఈ సినిమాను భారత ప్రజలందరూ చూసి ఎంజాయ్ చేయాలని కూడా సూచించారు.

English summary
Amitabh Bachchan says he was disgusted when people around him clicked selfies as he attended the cremation of his friend. "My dear friend passed away suddenly... was chatting and suddenly gone! Fragility of life... Went for the cremation to Delhi... at the cremation, people taking mobile pics and 'selfies'... disgusting! "They have no respect for the dead and no respect for the living that come to pay their respects for the dead...," the cine icon wrote.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu