బిటౌన్ మెగాస్టార్‌కు మళ్లీ అనారోగ్యం

'కౌన్ బనేగా కరోడ్‌పతి' 7వ సీజన్ షో షూటింగులో రెస్ట్ లేకుండా పాల్గొనడం వల్లనే ఇలా జరిగినట్లు అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు. అభిమానుల ఆశీస్సులు ఉన్నంత కాలం తనకు ఏమీ కాదని, తన హెల్త్ వివరాలు ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటానని బిగ్ బి చెప్పుకొచ్చారు.
ఉమేష్ శుక్లా దర్శకత్వంలో వచ్చే సినిమాలో అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడిగా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని భానుషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగే ఈచిత్రానికి '102 నాటౌట్' అనే టైటిల్ ఖరారు చేసారు. మరో 17 ఏళ్లు జీవించి ఎక్కువ కాలం జీవించిన వరల్డ్ రికార్డు స్థాధించాల లక్ష్యంతో ఉండే వ్యక్తి కథే ఈ సినిమా.
ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని అందరికీ ఓ పాఠంలా నవ్విస్తూ చెప్పే కథ ఇది. ఇందులో పరేష్ రావల్ 72 ఏళ్ల వయసున్న వ్యక్తిగా అమితాబ్ కొడుకు పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన అమితాబ్ ఈ పాత్రలోనూ అందరినీ మెప్పించడం ఖాయమని దర్శక, నిర్మాతలు నమ్ముతున్నారు.


Click it and Unblock the Notifications











