twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్ బచ్చన్ కి నోటీసులు: అక్రమ నిర్మాణం అంటూ....

    అమితాబ్ బచ్చన్ నిబంధనలకు విరుద్ధంగా లగ్జరీ బంగళా 'స్వాంక్'ను నిర్మించుకున్నారని ఆరోపిస్తూ, దాన్ని ఎందుకు కూర్చరాదో తెలియజేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

    |

    మాజీ ఎంపీ కూడా అయిన అమితాబ్ బచ్చన్ గోరేగామ్ ఈస్ట్ లో ఫిలిం సిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తాము అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా అడ్డగోలుగా నిర్మించారని మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తమ తనిఖీల్లో తేల్చారు.

    గోరేగామ్ ఈస్ట్ ప్రాంతంలో ఫిలిం సిటీకి సమీపంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ భవంతిపై ఆరోపణలు రాగా, టౌన్ ప్లానింగ్ అధికారులు తనిఖీలు చేసి, తాము అనుమతించిన విధంగా కాకుండా నిబంధనలు మీరి బంగళాను నిర్మించారని, బేస్ మెంటు, లిఫ్ట్, ప్రహరీగోడ తదితరాలు ఆమోదిత ప్లాన్ ప్రకారం లేవని తేల్చారు.

    Amitabh Bachchan gets BMC notice over illegal construction

    దీంతో బిగ్ బికి నోటీసులు జారీ చేసినట్టు మునిసిపల్ అధికారులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ చ‌ట్టం 2016 లో ఉన్న అనేక నిబంధ‌న‌ల‌ను వీరు ఉల్లంఘించి విలాస‌వంత‌మైన భ‌వంతుల‌ను నిర్మించుకున్నారు. ఈ భ‌వంతుల‌న్నీ ఓబ్రాయ్ రియాల్టీ సిబా లేజౌట్ లో ఉన్నాయి.

    నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చాల‌ని లేక‌పోతే కొత్త‌గా ప్లాన్ త‌యారు చేసి త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని వారికి ఆదేశించిన‌ట్లు బిఎంసి అధికారులు తెలిపారు.అమితాబ్ తోపాటు అక్రమంగా బంగళాలు నిర్మించుకున్న బాలీవుడ్ నిర్మాతలు రాజ్ కుమార్ హీరానీ, పంకజ్ బాలాజీ, సంజయ్ వ్యాస్, హరీష్ ఖండేల్ వాల్, హరీష్ జగిత్యాని, ఒబేరాయ్ రియల్టీలకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

    English summary
    The BrihanMumbai Municipal Corporation has served notice to Bollywood megastar Amitabh Bachchan and others for alleged illegal constructions on their swank luxury bungalows coming up near Film City in Goregaon east, RTI queries have revealed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X