చిరంజీవికి అమితాబ్ చేతుల మీదుగా ఏఎన్నాఆర్ అవార్డు.. బిగ్ బీ ఎమోషనల్
భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగిన నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం వేడుక ఘనంగా జరిగింది. అక్కినేని నాగార్జున పర్యవేక్షణలో ఏఎన్నార్ ఫౌండేషన్ అధ్వర్యంలో అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అమితాబ్ అవార్డును బహుకరించారు. ఈ సందర్బంగా బిగ్ బీ మాట్లాడుతూ..
ఇలాంటి సందర్భంలో మాట్లాడటం చాలా కష్టం. స్వర్గీయ ఏఎన్నాఆర్ జీవితానికి సంబంధించిన విజువల్స్ చూసిన తర్వాత ధన్యవాదాలు తెలియజేయడం తప్ప మరోటి లేదు. ఏఎన్నార్ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు అని అన్నారు. ఏఎన్నాఆర్ భారతీయ సినిమా పరిశ్రమకు గర్వకారణం అని అమితాబ్ అన్నారు.

తండ్రి వారసత్వాన్ని, ఆయన సాధించిన కీర్తీని ముందుకు తీసుకువెళ్లున్న నాగ్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌ను చూస్తే నా తండ్రి హరివంశరాయ్ బచ్చన్ తన చివరి కవితలో రాసిన పంక్తులు గుర్తుకు వస్తాయి. తన చివరి వీలునామాగా రాసిన కవితలో.. నా కొడుకు కేవలం నా కొడుకుగా ఉన్నందుకు నా వారసుడు కాలేడు. వారసుడిగా నా ప్రతిష్టను కొనసాగించే వాడే నా కొడుకు అని బిగ్ బీ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
అక్కినేని వారసత్వాన్ని కొనసాగించే విషయంలో నాగ్, ఆయన కుటుంబ సభ్యులు సక్సెస్ అయ్యారు. నిజమైన వారసులు అనిపించుకొన్నారు. శ్రీ నాగేశ్వరరావు గొప్ప నటుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహోన్నత వ్యక్తి పేరిట ఉన్న అవార్డును నా ప్రియ మిత్రుడు చిరంజీవికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

చిరంజీవి నాకు చాలా సందర్భాల్లో అండగా నిలిచారు. నేను ఏది అడిగినా కాదనలేదు. ఆయన నాకు ఆయన సినిమాలో అవకాశం ఇవ్వడమే కాదు.. నాగ్ అశ్విన్ సినిమాలో కూడా పార్ట్ అయ్యేందుకు కారణమయ్యాడు. ఈ సందర్భంగా నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగం కావడం గర్వంగా ఫీలవుతున్నాను అని అన్నారు. దాంతో సభలో కూర్చొన్న ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవితో నాకు అనుబంధం, ఫ్రెండ్ షిప్ గొప్పది అని అన్నారు.

చిరంజీవిని లంచ్ తినాలి అంటే.. ఎంత ఫుడ్ పంపించారో నాకు తెలుసు. కొద్దిగా అడిగితే.. ఆయన ఎలా స్పందిస్తారో నాకు తెలుసు. చిరంజీవి, నాగ్ అశ్విన్ మాదిరిగా నాకు వారి సినిమాల్లో రోల్స్ ఇవ్వాలని కోరుకొంటున్నాను. తెలుగు సినిమా పరిశ్రమలో భాగమై ఉండాలని కోరుకొంటున్నాను అని అమితాబ్ అన్నారు.


Click it and Unblock the Notifications











