డిపార్ట్ మెంట్ లో గాయపడ్డ మెగాస్టార్...!?
హిందిలో రూపొందుతున్న 'డిపార్ట్ మెంట్'లో నటించే ఆర్టిస్టులకు ఒకరి తర్వాత ఒకరికి డిపార్ట్ మెంట్ 'దెబ్బ' రుచి చూపిస్తోంది. మొన్నా మధ్య ఈ చిత్రం షూటింగులో హీరో రాణా దగ్గుబాటి గాయపడి, వారం రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి మనకు తెలుసు. ఇప్పుడు అదే కోవలో అందులో నటిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు స్వల్ప గాయాలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'డిపార్ట్‌మెంట్" ఈ చిత్రానికి సంబందించి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న అమితాబ్ కు ఛాతీపై చిన్న దెబ్బ తగిలింది. ఈ స్వల్ప గాయం కారణంగా శ్వాస సరిగా ఆడటం లేదని అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కొద్దిరోజుల క్రితం 'బోల్ బచ్చన్" చిత్రీకరణలో పాల్గొన్న సందర్భంగా రిక్షా నుంచి కింద పడటంతో అభిషేక్ కంటి దగ్గర స్వల్ప గాయమైంది. కాలు, చేయికి కూడా గాయాలయ్యాయి. అభిషేక్ కు కంటి దగ్గర ఆరు కుట్లు పడ్డాయి. దీన్ని బట్టి సినిమా షూటింగులో ప్రమాదానికి గురై గాయపడడం కాకతాళీయమనే చెప్పాలి!


Click it and Unblock the Notifications











