అమితాబ్‌కు జయా బచ్చన్ వార్నింగ్
బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన భార్య జయా బచ్చన్ నుంచి హెచ్చరికలు ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా వెల్లడించారు. 'ఏకలవ్య-ది రాయల్ గార్డ్' చిత్రం షూటింగ్ సందర్భం ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత విధువినోద్ చోప్రాతో తన మనసులోని మాటను బయట పెట్టాడట బిగ్ బి.
విధు వినోద్ చోప్రాతో తాను సినిమా చేయబోతున్నాను అని అమితాబ్ తన భార్యతో చెప్పినప్పడు...ఆమె వెటకారంగా నవ్వి, హెచ్చరిక చేసిందట. 'అతని(చోప్రా)తో పని చేసిన తర్వాత మీరు ఖశ్చితంగా బాధ పడతారు, ఎందుకంటే అతుడు ఆర్టిస్టును దూషిస్తూ, అరుస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడతాడు, మీరు అతనితో వేగలేరు, మూడు రోజుల్లో అతని సినిమా నుంచి తప్పుకంటారు, అతనితో కలిసి పని చేయక పోవడమే మంచిది' అని హెచ్చరించిందట.
అయితే హీరోయిన్ ప్రీతి జింతా మాత్రం విధు వినోద్ చోప్రాది అలాంటి వ్యక్తిత్వం కాదని, అతను ఆర్టిస్టుల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అంటోంది. ఇక 'ఏకలవ్య-ది రాయల్ గార్డ్' సినిమా గురించి విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ....ఏకలవ్య కథ అమితాబ్ కోసమే తయారు చేశాం. అతను సినీ పరిశ్రమలోని గొప్ప వ్యక్తుల్లో ఒకరు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
ఆ సంగతి పక్కన పెడితే...బిగ్ బి మనవరాలు బేటి బికి 'ఆరాధ్య' అనే పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను తాజాగా అమితాబ్ ఖండించారు. బేటి బికి ఇంకా పేరు ఖరారు చేయలేదని తేల్చి చెప్పాడు.


Click it and Unblock the Notifications











