మెట్రో సెక్సువల్ దారిలో బిగ్ బి అమితాబ్
బాలీవుడ్ స్టార్ మితాబ్ కి 'స్పా' ట్రీట్ మెంట్ అంటే నచ్చదు. అందుకే చాలా కాలంగా ఆయన వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన షారుఖ్, ఇతర బాలీవుడ్ హీరోల మాదిరి మెట్రో సెక్సువల్ అలవాట్లను ఇష్ట పడుతున్నారు. తాజాగా ఆయన తన బ్లాగులో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
''కొంత మంది లేడీస్ బ్యూటీ పార్లర్లు, స్పాల్లోనే తమ జీవితంలో ఎక్కువగా గడుపుతుండటం చూసి నేను ఆశ్చర్య పడేవాన్ని...అయితే వారు అలా ఎందుకు చేస్తున్నారో నేను కని పెట్టాను అంటూ తన బ్లాగులో పేర్కొన్నారు. ఇటీవల నేను 'స్పా'కి వెళ్లాను, అక్కడ కాళ్లకు పెడిక్యూలర్, చేతులకు మానిక్యూర్ చేసుకున్నాను. ఎంతో సుఖంగా అనిపించింది. మళ్లీ మళ్లీ వెళ్లి ఆ సుఖం అనుభవించాలిని ఉంది. లేడీస్ చాలా మంది ఆ హాయి కోసమే అక్కడ గడుపుతుంటారని నాకు ఇప్పుడు అర్థమైంది'' అంటూ పేర్కొన్నారు అమితాబ్.
ఇప్పటికే షారుఖ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు బాలీవుడ్ మెట్రో సెక్సువల్ స్టార్స్ గా పిలవ బడుతున్నారు. తాజాగా వారి బాటలో అమితాబ్ కూడా చేరడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











