»   » ‘సైరా’ షూటింగ్: హైదరాబాద్ వచ్చిన అమితాబ్, ఫస్ట్ లుక్ ఇలా ఉండబోతోంది...(ఫోటోస్)

‘సైరా’ షూటింగ్: హైదరాబాద్ వచ్చిన అమితాబ్, ఫస్ట్ లుక్ ఇలా ఉండబోతోంది...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Amitabh Bachchan To Schedule For Saira Movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో నటింబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగులో పాల్గొనేందుకు అమితాబ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. 'సైరా' షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తున్న విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఆయన తన బ్లాగులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా ప్రియ మిత్రుడు చిరంజీవి కోసం

నా ప్రియ మిత్రుడు చిరంజీవి కోసం

‘‘నా ప్రియ మిత్రుడు చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి'లో ఓ అతిథి పాత్రలో నటించమని నన్ను కోరారు. అందుకే హైదరాబాద్ వచ్చాను. కొన్ని గంటల్లో చిత్రీకరణలో పాల్గొనబోతున్నాను.... అని అమితాబ్ చెప్పుకొచ్చారు.

సైరాలో అమితాబ్ లుక్ ఇలా...

సైరాలో అమితాబ్ లుక్ ఇలా...

ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ టెస్ట్‌లు జరిగాయి.. సైరాలో నేను కాస్త అటూ ఇటుగా ఇలా కనిపించబోతున్నాను అంటూ అమితాబ్ తన బ్లాగులో ఓ ఫోటో పోస్టు చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ చిరంజీవి గురువు పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.


చెర్రీకి బర్త్ డే విషెస్

చెర్రీకి బర్త్ డే విషెస్

కాగా... తాను హైదరాబాద్ వచ్చిన రోజు, రామ్ చరణ్ పుట్టినరోజు ఒకే రోజు కావడంతో ఈ సందర్భంగా బ్లాగు ద్వారా ఆయన చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అమితాబ్.
ప్రత్యేక విమానంలో

ప్రత్యేక విమానంలో

ముంబై నుండి అమితాబ్ హైదరాబాద్ రావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అమితాబ్ చేస్తున్నది చిన్న పాత్రే కావడంలో ఒకే షెడ్యూల్‌లో ఆయన షూటింగ్ పార్టు పూర్తి చేయబోతున్నారని, తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిన తర్వాతే అమితాబ్ తిరిగి ముంబై వెళతారని సమాచారం.
శరవేగంగా షూటింగ్

శరవేగంగా షూటింగ్

‘సైరా' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా.... ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. మెగా తనయుడు రామ్ చరణ్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నారు.


అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


నయనతార హీరోయిన్

నయనతార హీరోయిన్

‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార నటిస్తోంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నయనతార కూడా జాయిన్ అయ్యారు.


 అమిత్ త్రివేది

అమిత్ త్రివేది

తాజా సమాచారం ప్రకారం ‘సైరా'కు బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ఫైనలైజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇతడు హిందీలో ‘క్వీన్'.. కై పో చె'.. ‘ఉడ్తా పంజాబ్'.. ‘డియర్ జిందగీ' లాంటి సినిమాలకు సంగీతాన్నందించారు.


150 కోట్ల భారీ బడ్జెట్

150 కోట్ల భారీ బడ్జెట్

కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్లో రూ. 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2019లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


English summary
Amitabh Bachchan has headed out to Hyderabad to shoot for Chiranjeevi’s magnum opus titled Sye Raa Narasimha Reddy. As Big B reveals in his blog entry for March 27, he has been roped in for a guest appearance in the biopic based on the late freedom fighter Uyyalawada Narasimha Reddy. He also shared a picture from the first look test of the film and it looks mightily similar to his other project Shoebite’s look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X