జిమ్‌కు వెలుతున్న మెగాస్టార్: శరీరాకృతి కోసమే...
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.....వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. అసలు ఆయన ఈ వయసులో నటించడమే గొప్పవిషయం. అందులోనూ ఆయన తన తర్వాతి సినిమాకోసం శరీరాకృతి మార్చుకోవడం కోసం జిమ్ కు వెలుతున్నారంటే ఆశ్చర్యమే మరి.

అమితాబ్ బచ్చన్ ఇటీవల కాలంలో జిమ్ కు వెలుతుండటంతో మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన అనారోగ్యం బారిన పడ్డారని, డాక్టర్ల సూచన మేరకే జిమ్ కు వెలుతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ఊహాగానాలకు తెర దించుతూ అమితాబ్ తన బ్లాగు ద్వారా వివరాణ ఇచ్చారు.
ఆరోగ్యపరమైన సమస్యలేవీ లేవని.. శరీరాకృతి కోసమే జిమ్‌లో కసరత్తులు చేస్తున్నానని తెలిపారు. అయితే ఆ ప్రాజెక్టు వివరాలు మాత్రం అమితాబ్ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











