బి-మెగాస్టార్‌కు మళ్లీ నొప్పి
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న ఆయన రెండు నెలల క్రితం సర్జరీ చేసుకోగా...తాజాగా మళ్లీ అదే ప్రాంతంలో నొప్పి స్టార్ట్ అయింది. దీంతో ఆయన సిటీ స్కాన్ నిమిత్తం మంగళవారం ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి ఆయన తన బ్లాగులో తన కడుపు నొప్పి గురించి పేర్కొంటూ...'రాత్రి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది, నడవటానికి, కూర్చోవడానికి చాలా కష్టపడ్డాను. పరిస్థితి చాలా భయానకంగా అనిపించింది, మళ్లీ సిటి స్కాన్ కోసం వెళ్లే అవకాశం ఉంది' అంటూ పేర్కొన్నారు.
1982లో అమితాబ్ కూలీ సినిమా షూటింగులో రియల్ స్టంట్స్ చేస్తుండగా… కడుపులో బలమైన గాయమయ్యింది. అప్పట్లో ఆయన నెలల తరబడి ఆసుపత్రిలో ఉన్నారు. 2005లో ఆయన మరోమారు సర్జరీ చేయించుకున్నారు. రెండు నెలల క్రితం మళ్లీ భరించరాని కడపునొప్పి రావడంతో ఆపరేషన్ అనివార్యమయ్యింది. అమితాబ్‌కు అబ్డామినల్ సర్జరీ చేశాక కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
తాజాగా అమితాబ్‌కు మళ్లీ కడుపునొప్పి మొదలు కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తరచూ ఆయన ఇలా అనార్యానికి గురవుతుండటం ఫ్యాన్స్‌లో కొత్త అనుమానాలు రేకెత్తున్నాయి.


Click it and Unblock the Notifications











