ప్రపంచ కప్ వివాదం.. ఐసీసీ తీరుపై మెగాస్టార్ కామెంట్స్

Recommended Video

ICC Cricket World Cup 2019 Final : Amitabh Bachchan Mocks The ICC On ‘Boundary Count’ || Oneindia

ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. ప్రపంచ కప్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో క్రీడాభిమానుల్లో ఉత్కంఠ రేపింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌ చివరకు టై కావడంతో.. సూపర్ ఓవర్ పెట్టారు. అయితే అది కూడా టై కావడం.. ఆపై ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ అంశంపై తన వాయిస్ వినిపించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆ వివరాలు చూస్తే..

వరల్డ్ కప్ ఫైనల్ 2019.. హోరా హోరీ పోరు

వరల్డ్ కప్ ఫైనల్ 2019.. హోరా హోరీ పోరు

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు పెట్టారు. అది కూడా టై కావడంతో ఇంగ్లాండ్ జట్టు విజేతగా ప్రకటించబడింది.

క్రీడాభిమానుల ఆగ్రహం

క్రీడాభిమానుల ఆగ్రహం

దీంతో రెండు జట్లు సాధించిన బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను మ్యాచ్ విజేతగా ప్రకటించారు ఐసీసీ వరల్డ్ కప్ నిర్వాహకులు. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించడం లేదు. ఈ నిబంధనపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు అందరు కూడా ఐసీసీ తీరుపై మండిపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

ఐసీసీ తీరుపై మెగాస్టార్ స్పందన

తాజాగా ఈ ఇష్యు పై తనదైన స్టైల్ లో స్పందించారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. డబ్బును ఉదాహరణగా చూపిస్తూ.. ''మీ దగ్గర ఓ 2000 రూపాయలు, నా దగ్గర కూడా ఓ 2000 రూపాయలు ఉన్నాయనుకుందాం. మీ వద్ద 2000 రూపాయల నోటు ఉంటే, నా దగ్గర మాత్రం నాలుగు 500 నోట్లు ఉన్నాయి. అప్పుడు మనిద్దరిలో ఎవరు ధనవంతుడని ప్రశ్నిస్తే ఎక్కువ నోట్లున్నాయి కాబట్టి నేనే ధనవంతున్నని ఐసీసీ నిర్ణయిస్తుంది'' అంటూ అమితాబ్ ఐసీసీ తీరును తప్పుబడుతూ ట్వీట్ పెట్టాడు అమితాబ్.

తెలుగు తెరపై అమితాబ్

తెలుగు తెరపై అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నారు. చిరు హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అమితాబ్. అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X