Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కల్కి 2898 AD. రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ జంటగా, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్ లాంటి ప్రముఖులు నటిస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అమితాబ్ లుక్‌ను ఓ పవిత్రమైన ప్రదేశంలో రిలీజ్ చేశారు. ఆ ప్రదేశం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? అక్కడే ఎందుకు రిలీజ్ చేశారనే విషయంలోకి వెళితే..
కల్కి చిత్రంలో అశ్వత్తామ అనే పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కథ పురాణాలకు సంబంధించినది కావడంతో సినిమా ఫాంటసీ, ఫిక్షన్‌గా రూపొందుతున్నది. ఈ సినిమాలోని బిగ్ బీ లుక్‌ను మధ్య ప్రదేశ్‌లోని నేమావార్ ప్రాంతంలో రిలీజ్ చేశారు. ఈ లుక్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తున్నది.

అయితే అశ్వత్తామ లుక్‌ను నేమావర్‌లోనే రిలీజ్ చేయడానికి ఓ ప్రత్యేకత ఉంది. చరిత్రలో అశ్వత్తామ నడిచిన ప్రాంతంగా భావిస్తారు. అయితే ఇంకా ఆయన అక్కడే ఉన్న పవిత్రమైన అనుభూతి ఆ ప్రాంతవాసులకు ఉంటుంది. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని అమితాబ్ బచ్చన్ లుక్‌ను అక్కడే రిలీజ్ చేసినట్టు చిత్ర యూనిట్ వివరించారు.
కల్కి సినిమాలోని తన లుక్‌ను అమితాబ్ బచ్చన్ స్వయంగా తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటించిన అనుభూతిని నేను తప్ప ఎవరూ పొందలేరు. ఇలాంటి ప్రాజెక్టును తీయాలనే ఆలోచన గొప్పది. ఆధునిక టెక్నాలజీతో చిత్రీకరించిన తీరు గొప్ప అనుభూతి. అలాగే సూపర్ స్టార్స్‌తో కలిసి నటించడం మాటలకు అందని ఫీలింగ్ అని అమితాబ్ అన్నారు.
కల్కి అలియాస్ ప్రాజెక్ట్ కే చిత్రంలో దిశా పటానీతోపాటు పలువురు నటిస్తున్నారు. ఈ సినిమా గ్లోబల్ మూవీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన రిలీజ్ కానున్నట్టు ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











