జంజీర్ సెట్స్‌లో రామ్ చరణ్‌కు బిగ్‌బి సర్పైజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం జంజీర్ షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభం అయింది. ప్రస్తుతం చెర్రీ, ప్రియాంక చోప్రాలపై టాకీ పార్టును చిత్రీకరిస్తున్నారు. జంజీర్ ఒరిజినల్ వెర్షన్లో హీరోగా నటించిన అమితాబ్ బచ్చన్ సడన్‌గా ఈ షూటింగ్ సెట్లో దర్శనం ఇచ్చి చరణ్‌కు సర్పైజ్ ఇచ్చారు. అనంతరం చరణ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.
అమితాబ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చరణ్ తన క్లోజ్ ఫ్రెండ్ చిరంజీవి కుమారుడని, ఇప్పటికే టాలీవుడ్లో తన సినిమాలతో ప్రత్యేకను సంతరించుకున్న చరణ్ ఇక్కడ కూడా సక్సెస్‌ఫుల్ స్టార్‌గా ఎదుగుతాడనే ఆశాభావం వ్యక్తం చేశారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా మళ్లీ రీమేక్ కావడంపై బిగ్ బి సంతోషం వ్యక్తం చేశారు. చరణ్‌కు గుడ్ లక్ చెప్పారు.
'జంజీర్' చిత్రం రీమేక్ కావడం నాకు ప్రశంస లాంటిదని, ఆ చిత్రం మళ్లీ రావడంపై ఎంతో సంతోషంగా ఉన్నానని, అద్భుతమైన సినిమాలు మాత్రమే మళ్లీ రీమేక్ చేయబడతాయన్నారు. ఈ చిత్రం రీమేక్ విషయంలో నా అభిప్రాయం కోరడం తప్పే అవుతుంది. నేను శుభాకాంక్షలు మాత్రమే అందించగలను, ఒక ఆర్టిస్టుగా ఆ చిత్రంలో పని చేశాను, రెమ్యూనరేషన్ తీసుకున్నాను ఇట్స్ ఓవర్! జంజీర్ చిత్రాన్ని మళ్లీ ఒక విజయవంతమైన చిత్రంగా రూపొందిస్తారని ఆశిస్తున్నాను అని ఇటీవల ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











