ట్విట్టర్ లో అథిక ఆదరణగల సినీ స్టార్స్ వీళ్లే
ముంబై: సెలబ్రిటీల్లో ట్విట్టర్ ఆదరణ కలిగిన తారల్లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ప్రియాంకా చోప్రాలే ఆక్రమించారు. మన దేశానికి చెందిన సినిమా సెలబ్రిటీలలో ఏకైక హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా అయిదో స్థానంలో ఉన్నారు. తమ సినిమాల ప్రచారానికి, వ్యక్తిగత అనుభవాల్ని పంచుకోవటానికి కూడా బాలీవుడ్ తారలు ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్నట్లు నివేదిక తెలియచేస్తోంది
బాలీవుడ్ ట్విట్టర్ సూచికగా చెప్పే బాలీవుడ్ నటీనటులపై చేసిన ఒక సర్వే ప్రకారం ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్‌కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ (అభిమానులు) ఉంది. సుమారు 87 శాతం మంది ఆయన ట్వీట్స్‌ని అనుసరిస్తారు. ట్వీట్‌లు అనసరించే వారు 35 సంవత్సరాలలోపు వారైనా 70 ఏళ్ల అమితాబ్‌ని ఆరాధిస్తుండటం విశేషం. ఆయన ట్వీట్స్‌లో హాస్యం పాళ్లు అధికంగా ఉండి, నిజ జీవితంలో జరిగే సంఘటనల పట్ల ఆయన భావాలకి అద్దంపడతాయి. ఈ రెండు అంశాలే ఆయన వయస్సుని కనుమరుగు చేసి యువతని ఆయన వైపు లాక్కుంటున్నాయి.

షారుక్ తన పని, భార్య, పిల్లలు, తనకు విచారం కలిగించిన విషయాల్ని కూడా అభిమానులతో పంచుకుంటారు. ప్రజలకు సన్నిహితమవటానికి సల్మాన్ ఖాన్ అయితే ఎక్కువగా హిందీలోనే ట్వీట్ చేస్తారు. తన సినిమాలకు పోస్టర్లు డిజైన్ చేయమనటం, ఓటు వేయాలని అభ్యర్థించడం వరకు అన్ని రకాల ట్వీట్స్ చేస్తారు కానీ జీవితానికి సంబంధించిన వేదాంతం కబుర్లు మాత్రం చెప్పరు.
తన ఇమేజ్ గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి ప్రియాంక చోప్రా. తనకు ఇష్టమైన బ్రాండ్స్ గురించి ఆమె ప్రచారం చేయడమే కాకుండా సమాజానికి సంబంధించిన విషయాలు, తన ప్రాజెక్టుల గురించి కూడా ట్వీట్ చేస్తారు. అమీర్‌ఖాన్ ట్వీట్‌లు విసుగు కలిగించవని అభిమానులు అంటారు.


Click it and Unblock the Notifications











