మరొకడు నాకు పోటీనా? వర్మ యాక్టింగ్ ఎంట్రీపై అమితాబ్, కీరవాణి... ఇంకెన్నీ సిత్రాలు చూడాలో..
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటుడిగా మరో అవతారం ఎత్తారు. తన తాజా చిత్రం కోబ్రాలో రాంగోపాల్ వర్మ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శివ, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వర్మ నటుడిగా మారడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే

చివరకు నచ్చిన వృత్తిని
ఆర్జీవి నటుడుగా ఎంట్రీ ఇవ్వడంపై అమితాబ్ స్పందిస్తూ.. చివరకు రాంగోపాల్ వర్మ.. ది సర్కార్ తనకు నచ్చిన వృత్తిని సరిగ్గా గుర్తించాడు. ఆయన నటనను వృత్తిగా స్వీకరించడం స్వాగతం. ఆల్ ది బెస్ట్ సర్కార్. ఇండస్ట్రీలో నాకు ఇంకోకడు పోటీగా తయారు అవుతున్నాడు అని బిగ్ బీ ట్వీట్ చేశారు.

ఇంకా మార్పులు చూడొచ్చు
రాంగోపాల్ వర్మ మంచి మ్యూజిక్ లవర్. ఆయన ఫస్ట్ టైమ్ బర్త్ డే
సెలబ్రేట్ చేసుకోవటం మనం ఊహించనిది. ఇలాంటి మార్పులు కోబ్రా చిత్రంలో మనం
ఇంకా చూడొచ్చు. నాలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా రాము బయటకు
తీస్తారనుకుంటున్నాను. నటుడిగా కూడా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. ఎందుకంటే
మనం నిజ జీవితంలో నటిస్తూ ఉంటాం. కానీ ఆయన నటించరు.. ఇప్పుడు నటించాల్సి
ఉంటుంది. 29 ఏళ్ల క్షణక్షణం తర్వాత మళ్లీ రాముతో పనిచేయడం చాలా
సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చినందుకు ఆయనకు చాలా థాంక్స్.

సినిమాలు, వెబ్ సిరీస్‌లతో
ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాత ‘‘డి.పి.ఆర్'' మాట్లాడుతూ
‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్'' బ్యానర్ మీద ఈ ‘‘కోబ్రా'' చిత్రాన్ని
నిర్మించేందుకు అవకాశం ఇచ్చినందుకు వర్మకు ధన్యవాదాలు. సంవత్సరం లో 8
నుంచి 10 సినిమాలు, వెబ్ సిరీస్ లు మా బ్యానర్ మీద వర్మ గారితో
తీస్తాం. ఆ ఐడియా ఇచ్చింది ఆయనే. దానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం అని అన్నారు.

కోబ్రా మూవీ కథ ఏమిటంటే
కోబ్రా సినిమా గురించి వర్మ వెల్లడిస్తూ.. ఓ రౌడీ షీటర్ ఓ నక్సలైట్ మారి ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా, పోలీసు కోవర్టుగా మారిన జీవిత కథ ఇది. దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ మాదిరిగా నేర సామ్రాజ్యానికి బ్రాండ్‌గా మార్చాడు. అతను చనిపోయేంత వరకు కోబ్రా ఎవరో తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా మాఫియా కార్యక్రమాలు నిర్వహించారు అని వర్మ ట్వీట్ చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు:
రాం గోపాల్ వర్మ,
కె.జి
రంగారావు
సాంకేతిక నిపుణులు:
నిర్మాణం- ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్
సంగీతం: ఎం.ఎం కీరవాణి
నిర్మాత: డి.పి.ఆర్
దర్శకత్వం: రాం గోపాల్ వర్మ అండ్ అగస్త్య మంజు


Click it and Unblock the Notifications











