రవీంద్రనాథ్ ఠాగూర్ గా...అమితాబ్!

By Bojja Kumar

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో...విశ్వకవి రవీంద్రనాథ్ పాత్రలో కనిపించబోతున్నాడు. రవీంద్రుడి జీవిత కథ ఆధారంగా రూపొందబోతున్న చిత్రంలో అమితాబ్ ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని అర్జంటీనాకు చెందిన దర్శకుడు పాబ్లోసీజర్ తెరకెక్కించబోతున్నారు. గోవాలో జరుగుతున్న 42వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తన రూపొందించిన 'షోర్" చిత్రం ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో భారత్ వచ్చిన సీజర్ మీడియాతో మాట్లాడుతూ....త్వరలో నేను రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందిస్తున్నాను. ఆ పాత్ర చేయడానికి అమితాబ్ అయితే బాగుంటుందని భావిస్తున్నాను. ఆయన ఒప్పుకుంటాడనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ ఆశ్రమమైన శాంతినికేత్ ప్రాంణంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే అమితాబ్ ఈ పాత్ర చేయడాకి ఒకే చెప్పాడా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మన దేశ జాతీయ గీతం 'జనగణమణ" రచించిన మహనీయుడు, నోబెల్ బహుమతి అందుకున్న మేధావి కాబట్టి అమితాబ్ తప్పకుండా ఈ పాత్ర చేస్తారని, ఆయన కెరియర్ లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్ర ఓ మైలురాయిలా మిగిలి పోతుందంటున్నారు సినీ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X