Amitabh- Allu Arjun: మీరే ఏంతో మందికి స్ఫూర్తి .. బన్నీయాక్టింగ్ కు బిగ్ బీ ఫిదా..
Amitabh Allu Arjun:సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 సినిమా గురించే చర్చ. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా అంచనాలను దాటి భారీ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు మొత్తం మోగిస్తోంది. కేవలం మూడు రోజులలో 600 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. సినిమాలో ఒక్కొక్క సీనుకు థియేటర్లు దద్దిరిల్లుతున్నాయి. అల్లు అర్జున్ యాక్షన్ సీన్స్ కు, జాతర సీన్స్ కు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. దీంతో అల్లు అర్జున్ యాక్టింగ్ పై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేయడం చర్చనీయంగా మారింది.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందాన మధ్య అద్భుతంగా సాగిన కెమిస్ట్రీ, ఐదు సంవత్సరాలుగా ఒకే సినిమాపై అల్లు అర్జున్ పనిచేయడంతో క్రిస్ ఏర్పడింది. అలాగే ఈ సినిమాలో పోలీస్ అధికారిగా మలయాళం నటుడు ఫయాద్ ఫాజిల్ అద్భుతంగా నటించి మెప్పించారు.

పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. ముఖ్యంగా జాతర సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ పూనకం వచ్చినట్టు డ్యాన్స్ చేయడం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. కొన్ని సీన్స్ చిత్రీకరించిన తీరు చూస్తుంటే డైరెక్టర్ సుకుమార్ కు హాట్సాప్ చెప్పాల్సిందే. అలాంటి సీన్స్ లలో అల్లు అర్జున్ రిస్కీగా సాహసం చేసి నటించడం కూడా ప్రశంసనీయమే. ఈ సినిమా సక్సెస్ తర్వాత ముఖ్యంగా అల్లు అర్జున్ నటన పై సినీ ప్రముఖులు, సినిమా అభిమానులు బన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోసారి నేషనల్ అవార్డును కైవసం చేసుకుంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో గా తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. 'మీరు నా అర్హతను మించి ప్రశంసించారు. నిజం చెప్పాలంటే.. నేను మీ ప్రతిభకు మీ పనితీరుకు పెద్ద అభిమానిని, మీరు ఇలాగే ఎంతోమంది నటులకు స్ఫూర్తినిస్తూ కొనసాగాలి' అంటూ బిగ్ బి అమితాబచ్చన్ ఇంట్రెస్టింగ్ ట్వీస్ట్ చేశారు.
అంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమితాబచ్చన్ ను కొనియాడారు. అమితాబ్ తనకు ఎంతో ఇష్టమైన హీరో అని, ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని తెలిపారు. ఆయన నుంచి తాను స్ఫూర్తి పొందానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ వీడియోను అమితాబచ్చన్ తన సోషల్ మీడియా వేదికపై షేర్ చేశారు.
#AlluArjun ji .. so humbled by your gracious words .. you give me more than I deserve .. we are all such huge fans of your work and talent .. may you continue to inspire us all .. my prayers and wishes for your continued success ! https://t.co/ZFhgfS6keL
— Amitabh Bachchan (@SrBachchan) December 9, 2024
ఈ తరుణంలో అల్లు అర్జున్ దానికి స్పందిస్తూ..'మీరు మా సూపర్ హీరో, నా పట్ల చూపించిన ప్రేమకు నేను ఎంతో ధన్యుణ్ణి' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కొనసాగిన ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర హీరోలను అల్లు అర్జున్ ని పొగడ్తల వర్షంతో ముంచేతడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో నీ అవ్వ తగ్గేదేలే అంటూ దూసుకు వెళ్తున్నాడు. ఓ తెలుగు హీరో ఫ్యాన్ ఇండియా హీరోగా ఎదగడం మనకు కూడా గర్వకారణమే కదా.


Click it and Unblock the Notifications











