ఆ తెలుగు హిట్ రీమేక్‌లో అమితాబ్
తెలుగులో హిట్టైన రంగం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయటానికి రంగం సిద్దమైంది. తెలుగులో ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అరక్షన్ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఇదే. ఇక హీరో జీవా పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించనున్నారు. ప్రకాష్ ఝా, రణ్‌బీర్‌కపూర్ కాంబినేషన్‌లో ఇంతకు ముందు రాజనీతి చిత్రం రూపొందింది. కో హిందీ వెర్షన్ తెరకెక్కించడానికి దర్శకుడు ప్రకాష్ ఝా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారని సమాచారం.
ఇక తమిళంలో జీవాకు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన చిత్రం రంగం. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో సూపర్ హిట్టైంది. ఇక ఇందులో హీరోయిన్ల పాత్రలకు నటి రేణుక, సదాను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభంకానుంది. ఇక అమితాబ్ తెలుగులో హిట్టైన ఢీ రీమేక్ లో సైతం నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అబిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రంలో అమితాబ్ ..తండ్రి చంద్రమోహన్ పాత్రను పోషిస్తారు. ప్రస్తుతం అమితాబ్..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











