twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంక్షన్ లో 'దటీజ్‌... అమితాబ్‌' అన్నారంతా...

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : ఉగాది రోజు సాయింత్రం జరిగిన నంది అవార్డుల వేడుకలో అమితాబ్ హుందా అయిన ప్రవర్తన చూసి అంతా దటీజ్ అమితాబ్ అన్నారు. వివరాల్లోకి వెళితే... సీఎంతో కలసి అమితాబ్‌ లలిత కళాతోరణం బయటికి వచ్చారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లిన తరవాత అమితాబ్‌ కారు వద్దకు వస్తుండగా అభిమానులు ఆయనను చూడటానికి తోసుకొచ్చారు.

    దాంతో పోలీసులు అదుపు చేస్తుండగా మధ్య వయస్కుడైన ఓ అభిమాని మొక్కల్లోపడిపోయాడు. కారు ఎక్కబోతున్న అమితాబ్‌ చూసి... ఆ వ్యక్తి మొక్కల్లోంచి లేపమని చెప్పి... అనంతరం ఆ అభిమానితో కరచాలనం చేశారు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇది చూసిన సినిమావారు,ఫ్యాన్స్ అంతా ఆయన నిరాబండరమైన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోయారు.

    ఇక భారత సినీరంగానికి విశేష కృషి చేసిన ప్రముఖనటుడు అమితాబ్‌బచ్చన్‌కు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఎన్టీఆర్‌ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది.

    అనంతరం ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు అమితాబ్‌బచ్చన్‌ అన్నారు. భారతీయ సినిమారంగంలో మంచిపేరున్న ఎన్టీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డు తనకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే భారతీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకుందని ఆయన వెల్లడించారు. జాతీయ సమగ్రతకు సినిమా ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

    English summary
    
 Bollywood actor Amitabh Bachchan was tonight presented with N T Rama Rao National Film Award set up by the Andhra Pradesh government. "I have no words to express my extreme gratitude for this very very warm welcome....I feel very honoured and very humbled to receive this recognition from Andhra Pradesh government," Bachchan said after receiving the award from Andhra Pradesh chief minister N Kiran Kumar Reddy in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X