అమితాబ్ బచ్చన్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
ఇంతకు ముందు ఇదే పిటీషన్ ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ బాంబే హైకోర్టులో వేసింది. అయితే 2012 జులైలో బాంబే హైకోర్టు అమితాబ్ బచ్చన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే బాంబే హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.
అమితాబ్ సినిమాల విషయానికొస్తే..
బిగ్ బి త్వరలో 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో తో కలసి నటించబోతున్నారు.డికాప్రియో ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'ది గ్రేట్ గాట్స్‌బీ' చిత్రంలోకీ రోల్ కి అమితాబ్ ని ఎంపిక చేసారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే ఈ చిత్రం త్రీడీ సినిమా. ఇస్లా ఫిషర్ హీరోయిన్ గా చేస్తోన్న ఈచిత్రంలో మేయర్ వుల్ఫ్‌షీమ్ అనే పాత్రలో ఆయన కనిపిస్తారు. ఈ చిత్రానికి బజ్ లహ్రమన్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 10, 2013లో ఈచిత్రం విడుదల కానుంది.
అమితాబ్ గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ప్రపంచంలోని గొప్ప నటుల్లో అమితాబ్ ఒకరు. ఆయన నా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. అమితాబ్ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. భారతీయ చిత్రాలపై అభిమానం ఏర్పడటానికి ఆయన నటించిన 'షోలే' చిత్రమే కారణం'' అన్నారు.


Click it and Unblock the Notifications












