అనుష్క, విద్య, ప్రియాంకలను అమితాబ్ ముద్దులు(ఫోటో ఫీచర్)
ముంబై : స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమం బాలీవుడ్ తారల కోలాహలంతో కలర్ ఫుల్ గా మారింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో సహా...పలువురు తారల స్టేజి పెర్ఫార్మెన్స్ సభికులను ఆకట్టుకుంది. 'జుమ్మా చుమ్మా' అనే సాంగుకు అమితాబ్ స్టెప్పులు వేయడం....ఇందులో ప్రియాంక చోప్రా, విద్యా బాలన్, అనుష్క శర్మ జాయిన్ అయి అదర గొట్టడం, పాట లిరిక్స్ కు తగిన విధంగా వారిని ముద్దు పెట్టుకోవడం హైలెట్‌గా మారింది.
70 ఏళ్ల అమితాబ్ ఈ కార్యక్రమంలో 'స్టార్ ఆఫ్ ది సెంచరీ' అవార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు 'బోల్ బచ్చన్' సినిమాకు గాను కామెడీ, రొమాన్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అభిషేక్ షూటింగ్ నిమిత్తం న్యూయార్కులో ఉండగా....అతని తరుపున ఆ అవార్డును కూడా అందుకున్నారు అమితాబ్.

స్టార్ డస్ట్ అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్లకు ముద్దులిస్తున్న అమితాబ్

భర్త సిద్దార్థతో విద్యా బాలన్

కరణ్ జోహార్, ఫరా ఖాన్

భార్యతో నటుడు సచిన్

ఈమె సెక్సీ డ్రెస్ ఆకట్టుకుంది

అవార్డులతో అమితాబ్

బిపాసా బసు

ప్రియాంక చోప్రా
ఈ విషయాలను అమితాబ్ తన బ్లాగులో వెల్లడించడంతో పాటు.....విద్యా బాలన్, ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా, అనుష్క శర్మ, బిపాసా బసులకు తాను 'పెక్'(మర్యాద పూర్వకంగా బుగ్గపై ఇచ్చే ముద్దు) ఇచ్చినట్లు అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇతర అవార్డుల వివరాల్లోకి వెళితే...బెస్ట్ యాక్టర్(డ్రామా) విభాగంలో అగ్నిపథ్ సినిమాలో నటనకు గాను హృతిక్ రోషన్‌కి ఉత్తమ నటుడి అవార్డు దక్కగా, బర్ఫీ చిత్రానికి గాను బెస్ట్ యాక్ట్రెస్(డ్రామా)అవార్డు ప్రియాంక చోప్రాకు లభించింది. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రానికి గాను శ్రీదేవికి బెస్ట్ కంబ్యాక్ అవార్డు లభించింది. యాక్షన్ థ్రిల్లర్ కేటగిరీలో అక్షయ్ కుమార్(రౌడీ రాథోడ్) బెస్ట్ యాక్టర్ గా, విద్యా బాలన్ కు(కహానీ) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications











