పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ ఫిదా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా మారి రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ ని నటుడిగా గమనించినా, రాజకీయ నాయకుడిగా గమనించినా ఆయన నోటి నుంచి జాతీయ వాదానికి సంబందించిన మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ అందరికంటే భిన్నంగా కనిపిస్తాడు.
తాజగా పవన్ కళ్యాణ్ ఇండియన్ ఆర్మీ సత్తాని, గొప్పదనాన్ని వివరించే కొన్ని సందేశాల్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అందరిని విపరీతంగా ఆకర్షించింది. భారత దేశ ఆర్మీ గురించి ప్రముఖులు ఆర్మీ అధికారులు పలు సందర్భాల్లో తెలిపిన మాటలు అవి. పవన్ ట్వీట్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని కూడా ఫిదా చేసింది.
అమితాబ్ కూడా దేశభక్తి గురించి తరచుగా మాట్లాడుతుంటారు. పవన్ చేసిన ట్వీట్ కు అమితాబ్ ధన్యవాదాలు చెబుతూ రీట్వీట్ చేశారు. దీనితో పవన్ కళ్యాణ్ ట్వీట్ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. పవన్ దేశ భక్తిని గుర్తించిన అమితాబ్ కు పవన్ ఫాన్స్ వరుసగా కృతజ్ఞతలు చెబుతూ రిప్లై ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications











