ఆ వస్తువులకు ప్రమోట్ చేయనని తేల్చి చెప్పిన అమితాబ్!

By Bojja Kumar

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్, స్మోకింగ్ ఉత్పతులకు ప్రచాం చేయనని తేల్చి చెప్పారు. ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని, నేను ఉపయోగించడానికి ఇష్టపడని ఏ వస్తువునూ తాను ప్రమోట్ చేయబోనని వెల్లడించారు.

భారత మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ రంగంలో అందించిన సేవలకుగాను మాస్టర్ ఆఫ్ క్రియేటివిటీ అవార్డును అమితాబ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ ఉత్పత్తులనైతే వాడతానో, వాటికే ప్రచారం చేస్తానని తెలిపారు.

Amitabh Bachchan reveals why he doesnt promote alcohol

తనకు ఏదైనా ఉత్పత్తి నచ్చి, దాన్ని తాను కూడా వాడగలననే నమ్మకం ఏర్పడితేనే వాటికి ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇష్టపడతానని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఏ వస్తువునూ తాను ప్రమోట్ చేయను అన్నారు.

75 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం అలుపు లేకుండా వరుస సినిమాలు చేస్తూనే పలు బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు అమితాబ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన '102 నాటౌట్' ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. బిగ్ బి నటిస్తున్న మరో చిత్రం థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ చిత్రీకరణ దశలో ఉంది. 'సైరా నరసింహారెడ్డి' సినిమా ద్వారా అమితాబ్ తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X