twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ‘రైతు’ లో అమితాబ్ పాత్ర ఇదే? వెంటనే ఓకే చేయటానికి కారణం

    By Srikanya
    |

    హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు కష్ణవంశీ దర్శకత్వంలో బాలకష్ణ హీరోగా నటించే భారీ చిత్రం 'రైతు'లో నటించడానికి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అమితాబ్‌ లాంటి స్టేచర్‌ ఉన్న నటుడు నటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రామ్ గోపాల్ వర్మ రూపొందింస్తున్న సర్కార్ 3 సెట్స్ కు...బాలకష్ణ, కష్ణవంశీ వెళ్ళి ఆయనను కలిశారు.

    నందమూరి కుటుంబం పట్ల ఉన్న అభిమానంతోనూ, చిత్రంలోని పాత్ర నచ్చడంతోను ఈ సినిమాలో నటించడానికి అమితాబ్‌ ఒప్పుకున్నట్టు సమాచారం. అలాగే 17 రోజులు పాటు ఆయన డేట్స్ ని ఇచ్చారని తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ సినిమాలో అమితాబ్ పాత్ర ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది.

    అందుతున్న సమాచారం ప్రకాలం 'రైతు'లో అమితాబ్‌ బచ్చన్‌ రాష్ట్రపతి పాత్రలో కనిపించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రైతు నాయకుడిగా బాలకృష్ణ రాష్ట్రపతిని కలుసుకొనే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ఆ పాత్ర కోసమే అమితాబ్‌బచ్చన్‌ని సంప్రదించారని తెలుస్తోంది.

    Amitabh Bachchan role revealed in Balakrishna's Rythu

    బా లకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో నటిస్తున్నారు. సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే బాలకృష్ణ 101వ సినిమాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

    <strong>వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా? (ఫొటోలు)</strong>వర్మ షూటింగ్ స్పాట్ కు బాలయ్య వెళ్లటానికి అసలు కారణం ఇదా? (ఫొటోలు)

    కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చేయాలనే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. వందో చిత్రంగానే 'రైతు' తెరకెక్కుతుందని ప్రచారం సాగింది. అంతలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' కథ విని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు 'రైతు'ని 101వ చిత్రంగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది.

    గతంలో 'మనం' సినిమాలో అమితాబ్‌ కాసేపు కనిపించినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో ఆయన పూర్తి నిడివి పాత్ర పోషించడం మాత్రం ఇందులోనే అని చెప్పచ్చు. ఏమైనా, ఈ బాలీవుడ్‌ దిగ్గజం 'రైతు' సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.

    English summary
    If the reports are to be believed, Amitabh Bachchan role in 'Rythu' was known as 'President of India'. Balakrishna and Krishna Vamsi visited the sets of Sarkar 3 and met Amitabh for requesting him to do a guest role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X