twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛారిటీ కోసం వేలానికి అమితాబ్ బచ్చన్ జీన్స్ ప్యాంట్

    By Nageswara Rao
    |

    ముంబై: అనాధ వీధి బాలలకు మెరుగైన విద్యను అందించే కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. అంతర్జాతీయ స్దాయి విద్యను అనాధ బాలలకు అందించేందుకు అమితాబ్ తన జీన్స్ ప్యాంట్లను వేలం వేయనున్నారు. వేలం పాట ద్వారా వచ్చిన సొమ్ముని అనాధపిల్లల విద్యకు అందించనున్నారు.

    ఈ కార్యక్రమం పేరు 'జీనరేషన్'. ఇందులో భాగంగా 69 సంవత్సరాల వయసు కలిగిన అమితాబ్ బచ్చన్ పరిక్రమలో 'జీనరేషన్' ప్రారంభించిన సందర్భంగా ఆటోగ్రాఫ్ చేసిన తన జీన్స్ ప్యాంట్లను పిల్లలకు అందించారు. జీన్ ప్యాంట్ ధరను 24 వేల రూపాయలుగా నిర్ణయించి వేలంలో ఉంచారు. అయితే అమితాబ్ జీన్స్ కు మరింత ధర వచ్చే అవకాశముందని నిర్వహకులు అశిస్తున్నారు.

    అమితాబ్‌తో పాటు జీనరేషన్‌లో బాలీవుడ్‌కు చెందిన మరికొంత మంది సెలబ్రిటీల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మా సపోర్ట్ ఉంటుంది. ఈ అనాధ బాలలకు మరిన్ని విరాళాలు సేకరించేందుకు గాను పేస్‌బుక్‌లో ఉంచనున్నాం. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని అమితాబ్ తన బ్లాగ్‌లో రాశారు.

    ఈ వేలంలో కరీనా కపూర్, దీపికా పదుకుణె, ప్రియాంక చోప్రా, సైఫ్ ఆలీ ఖాన్, అనుష్క శర్మ, షాహిద్ కపూర్, అనిల్ కపూర్‌లతో పలువురు సెలబ్రిటీలు ధరించిన జీన్స్ అందుబాటులో ఉండనున్నాయి. పరిక్రమ అనే సంస్దను 2003లో స్దాపించడం జరిగింది. ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని అనాధ పిల్లల చదువుకి వినియోగించనున్నారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    
 Megastar Amitabh Bachchan's pair of jeans is all set to go under the hammer to raise funds for a non-profit organization that provides under-privileged children access to world class education.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X