Just In
- 2 min ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 13 min ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 1 hr ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
Don't Miss!
- Finance
ఒక్కరోజులో రూ.2.08 లక్షల కోట్ల సంపద హాంఫట్: 3 రోజుల్లో 1800 పాయింట్లు..
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీ ముగ్గురు తప్ప మరొకరు సినిమా చూడరేమో... ఆర్జీవికి అమితాబ్ షాక్.. ఆ సినిమా ఏదంటే..
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌తో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కేక పెట్టించే సినిమాలు తీశారు.. అదే సమయంలో షోలే, నిశ్శబ్ద్, సర్కార్ 3 లాంటి చెత్త మూవీస్ తీసి అభాసుపాలయ్యాడు. అయితే అమితాబ్‌తో ఓ హిందీ సినిమా తీసే సమయంలో ఆ చిత్ర విజయం గురించి అమితాబ్ ముందే ఊహించడంట. తాజాగా నంబర్ 1 యారీ అనే కార్యక్రమంలో రానా దగ్గుబాటి ఆ విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ఆ సినిమా గురించి రానా ఏం చెప్పారంటే..

లీడర్ తర్వాత హిందీలో
లీడర్ తర్వాత నాకు హిందీలో అవకాశం వచ్చింది. అదీ రాంగోపాల్ వర్మ సినిమా కావడంతో ఎగిరి గంతేసినంత పనిచేసి ముంబైలో వాలిపోయాను. ఆ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అభిమన్యు సింగ్, మంచు లక్ష్మీ లాంటి ఉండటంతో సినిమా బ్రహ్మండంగా ఉంటుందనే ధీమాతో ఉన్నాను అని రానా చెప్పారు.

డిపార్ట్‌మెంట్ షూటింగ్‌లో అమితాబ్
భారీగా అగ్రతారలతో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా డిపార్ట్‌మెంట్. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా వర్మకు అమితాబ్ బచ్చన్ ఓ మాట చెప్పాడు. వర్మ గారు.. ఈ సినిమా రిలీజ్ తర్వాత నీవు, మీ ఆఫీస్ బాయ్, ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తిని చూపిస్తూ.. మీ ముగ్గురు మాత్రమే చూస్తారేమో అని అన్నారు. దాంతో నేను షాక్ తిన్నాను అని రానా తెలిపారు.

బిగ్ బీ చెప్పినట్టే ఆ సినిమా
అయితే డిపార్ట్‌మెంట్ సినిమా చూసిన తర్వాత అమితాబ్ చెప్పినట్టే జరిగింది. ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. కనీసం వర్మ కూడా ఆ సినిమా చూసి ఉండరు అని నేను అనుకొంటాను. ఆ సినిమా నాకు హిందీలో ఓ షాక్ కొట్టించిన సినిమా అని రానా అన్నారు.

బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా
డిపార్ట్‌మెంట్ చిత్రాన్ని వర్మ దాదాపు 32 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బురిడి కొట్టింది. అయినా వర్మ అంటే అమితాబ్‌కు నమ్మకం పోలేదు. తాజాగా మరోసారి సర్కార్ 3 అనే సినిమాను ఆయనతో తీశాడు. ఆ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.