దీపికతో అమితాబ్ బచ్చన్ డాన్స్ (ఫోటోలు)
హైదరాబాద్: దీపిక పదుకోన్, అర్జున్ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'ఫైండింగ్ ఫన్నీ' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇద్దరు స్టార్స్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపికతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు అమితాబ్.
'పైండింగ్ ఫన్నీ మూవీలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన 'షేక్ యువర్ బూటియా' అనే పాటకు అమితాబ్ బచ్చన్, అర్జున్ కపూర్, దీపిక పదుకోన్ కలిసి డాన్స్ చేసారు. అనంతరం వీరు ఇద్దరూ 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోలో పాల్గొని సందడి చేసారు.
ఫైండింగ్ ఫన్నీ చిత్రానికి హోమీ అదజనియా దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక పదుకోన్ ఈ చిత్రంలో భర్త చనిపోయిన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. రణవీర్ సింగ్ ఆమె భర్తగా అతిథి పాత్రలో నటించాడు. అర్జున్ కపూర్ హీరోగా నటించాడు. స్లైడ్ షోలో ఫోటోలు...

దీపిక, అర్జున్, అమితాబ్
దీపిక పదుకోన్, అర్జున్ కపూర్, అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి' సెట్లో ఇలా డాన్స్ చేసారు.

క్రేజీ టైం
లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి అర్జున్ కపూర్, దీపిక పదుకోన్ ఎంతో ఉల్లాసంగా గడిపారు.

షేక్ బూటియా
ఫైండింగ్ ఫన్నీ చిత్రంలోని షేక్ బూటియా అనే సాంగుకు అర్జున్ కపూర్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ స్టెప్పులేసారు.

అమితాబ్
‘దీపిక పదుకోన్, అర్జున్ కపూర్ రాకతో కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం ఎంతో లవ్లీగా సాగింది, బూటీ మూవింగ్ సాంగ్ కూడా హ హ హా' అంటూ అమితాబ్ ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

ఫైండింగ్ ఫన్నీ
ఫైండింగ్ ఫన్నీ సినిమా ప్రమోషన్లో భాగంగా అర్జున్ కపూర్, దీపిక పదుకోన్ కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











