మెగాస్టార్‌తో పని చేయడం గౌరవం: అమితాబ్ ఆసక్తికర కామెంట్
Recommended Video

Saira Movie Stills Goes Viral In Internet
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'సైరా నరసింహా రెడ్డి' షూటింగులో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అడుగు పెట్టినప్పటి నుండి ఆయన సైరా సినిమా గురించి, ఇందులో తన లుక్ గురించి, మెగాస్టార్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఆయన 'మెగాస్టార్‌తో పని చేయడం గౌరవం అంటూ' ట్వీట్ చేశారు. చిరంజీవి తనకు అత్యంత ప్రియమైన మిత్రుడని, ఆయనతో కలిసి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది అని అమితాబ్ వెల్లడించారు.
కాగా... 'సై రా నరసింహా రెడ్డి' చిత్రంలో అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి గురువు పాత్రలో నటిస్తున్నారు. పొడవాటి తెల్లగడ్డంతో అమితాబ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. అమితాబ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.
sye raa narasimha reddy amitabh bachchan ram charan chiranjeevi nayanthara సైరా నరసింహారెడ్డి అమితాబ్ బచ్చన్ రామ్ చరణ్ చిరంజీవి నయనతార


Click it and Unblock the Notifications