»   » షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ మెగాస్టార్: కాలు ఫ్రాక్చర్ అయినా షూటింగ్ ఆపలేదు

షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ మెగాస్టార్: కాలు ఫ్రాక్చర్ అయినా షూటింగ్ ఆపలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

థగ్స్ ఆఫ్ హిందోస్తాన్‌ ఫిల్మ్ షూటింగ్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గాయ‌ప‌డ్డారు. అతనొక సూపర్‌స్టార్... ఇటీవల షూటింగ్‌లో భాగంగా అతని కాలికి గాయమైంది. పైగా నడుమునొప్పితో కూడా బాధపడుతున్నాడు. అటువంటి పరిస్థితిలోనూ షూటింగ్ ఆగిపోకూడదని అంకిత భావంతో పనిచేశాడు.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఈ మధ్య సినిమా షూటింగ్‌లో భాగంగా కాలికి గాయమైంది. దీనికితోడు గత కొన్నాళ్లుగా ఆయనను నడుం నొప్పి వేధిస్తోంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ రానివ్వలేదు. షెడ్యూలు ప్రకారం షూటింగ్‌లో పాల్గొని మిగిలిన నటులకు ఆదర్శంగా నిలిచారు.

 Amitabh Bachchan shot with a fractured rib

ప్రస్తుతం అబితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి'తో పాటు 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. షూటింగ్ స‌మ‌యంలో అయిన ఈ యాక్సిడెంట్ వల్ల గతం లో అయిన పక్కటెముక గాయం కూడా తిరగబెట్టిందంటున్నారు.

అయినా ఏమీ ప‌ట్టించుకోకుండానే అమితాబ్ షూటింగ్ కొన‌సాగించారు. షూటింగ్‌లో గాయ‌ప‌డ్డా అమితాబ్ మాత్రం త‌న ప‌ని కొన‌సాగించాడు, అయితే ముంబైకి వ‌చ్చిన త‌ర్వాతే డాక్ట‌ర్ల ఆదేశాల ప్ర‌కారం ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ప‌క్క‌టెముక‌ల్లో చీలిక రావ‌డం వ‌ల్ల అమితాబ్‌కు తీవ్ర‌మైన నొప్పి వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. త‌గ్స్ ఆఫ్ హిందోస్తాన్ వ‌చ్చే ఏడాది దీపావ‌ళికి రిలీజ్‌కానున్న‌ది. విజ‌య్ కృష్ణా ఆచార్య దీన్ని డైర‌క్ట్ చేస్తున్నారు.

English summary
Big B had apparently injured himself while shooting. He experienced severe pain in his lower back and even though the team was ready to reschedule the shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu