కరోనావైరస్‌కు బిగ్ బీ ప్రశంసలు.. నా సర్కార్ ఆర్జీవికి సాటిలేరు అంటూ పొగడ్తల వర్షం

ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లుతో బిజీగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ లాక్‌డౌన్‌లో సినిమాను పూర్తి చేసి సినీ ప్రపంచానికి షాకిచ్చారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ పిరియడ్‌లో కొవిడ్ 19 కథాంశంతో కరోనావైరస్ అనే చిత్రాన్ని రూపొందించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. లాక్‌డౌన్‌లో రూపొందించిన కరోనావైరస్ సినిమాపై అమితాబ్ ప్రశంసలు గుప్పిస్తూ..

నా సర్కార్‌కు సాటిలేరు

నా సర్కార్‌కు సాటిలేరు

రాంగోపాల్ వర్మపై ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ.. ఆయనకు ఎవరూ సాటి రారు. చాలా మందికి ఆయన రాము. నాకు మాత్రం సర్కార్. లాక్‌డౌన్‌లో ఓ ఫ్యామిలీ కథాంశంతో మొత్తం సినిమా తీశారు. సినిమా పేరును కరోనావైరస్ పెట్టారు కనుక ఆ సినిమాలో వైరస్ గురించే చెప్పారు. ఇది ఆ సినిమా ట్రైలర్ అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే కరోనావైరస్

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే కరోనావైరస్

ఇక రాంగోపాల్ వర్మ తన సినిమా గురించి ట్వీట్ చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మార్గదర్శకాలు, సురక్షిత ప్రమాణాలను చాలా స్ట్రిక్టుగా పాటిస్తూ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయంలో అబద్దం చెప్పడం లేదని ఈశ్వర్, అల్లా, జీసస్, ప్రభుత్వంపై ఒట్టేసి చెబుతున్నాను అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

అందరూ వంట చేస్తుంటే.. నేను కరోనావైరస్‌తో

అందరూ వంట చేస్తుంటే.. నేను కరోనావైరస్‌తో

ఇక టాలీవుడ్ ప్రముఖులపై కూడా వర్మ సెటైర్లు సంధించారు. సినీ ప్రముఖులంతా కరోనా లాక్‌డౌన్‌లో ఇల్లు శుభ్రం చేస్తూ, వంట పాత్రలు కడుగుతూ, వంటలు చేస్తూ.. గార్డెనింగ్ చేస్తుంటే.. నేను కరోనావైరస్ మీద సినిమాలు తీశాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మంగళవారం రిలీజ్ చేసిన నాలుగున్నర నిమిషాల ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

Recommended Video

Why Upcoming Directors Should've To Rake RGV As Inspiration ? || Filmibeat Telugu
భైరవగీత ఫేం డైరెక్టర్

భైరవగీత ఫేం డైరెక్టర్


అంతా కొత్త నటీనటులతోపాటు టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నటుడు శ్రీకాంత్ అయ్యాంగర్‌ ప్రధాన పాత్రలో కరోనావైరస్ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని భైరవగీత ఫేం అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి డీఎస్ఆర్ మ్యూజిక్ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X