స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో అమితాబ్ మీటింగ్ (ఫోటో ఫీచర్)
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‍బర్గ్ ను సోమవారం రాత్రి ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హెటల్‌లో కలిసారు. స్పీవెన్ స్పీల్‌బర్గ్ సొంత సినీ నిర్మాణ సంస్థ డ్రీమ్ వర్స్క్ మరియు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 'లింకన్' చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో సెలబ్రేషన్స్‌లో భాగంగా స్టీవెన్ స్పీల్ బర్గ్ ఇండియా వచ్చారు.
ఈ సందర్భంగా స్పీల్‌బర్గ్‌ను కలిసిన అమితాబ్ బచ్చన్ తన ఆలోచనలను పంచుకున్నారు. అనంతరం ఆ లెజెండ్ దర్శకుడితో దిగిన ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసారు. 'స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో ఓ అద్భుతమైన సాయంత్రం గడిచింది. ఆయనతో సినిమాలు, స్కిప్ట్స్, ట్రెండ్స్, ఫ్యూచర్ అనేక విషయాలు చర్చించా' అని అమితాబ్ తన పేర్కొన్నారు.
వీరితో పాటు బాలీవుడ్ నుంచి అబ్బాస్ మస్తాన్, అశుతోష్ గోవర్కర్, కిరణ్ రావు, జావేద్ అక్తర్, సుధీర్ మిశ్రా, జోయా అక్తర్, రాజ్ కుమార్ హిరానీ, రమేష్ సిప్పీ, రాకీష్ ఓం ప్రకాస్ మిశ్రా, అనురాగ్ కశ్యప్, ఆర్ బాల్కి, గౌరీ షిండే, ప్రభుదేవా తదితరులు కూడా స్పీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

స్టీవెన్ స్పీల్ బర్గ్, అనిల్ అంబానీకి చెందిన రియలన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ‘లింకన్' చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా స్పీల్‌బర్గ్ ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా అమాతాబ్ ఆయన్ను కలుసుకున్నారు.

స్టీవెన్ స్పీల్ బర్గ్, అమితాబచ్ బచ్చన్ ముచ్చట్లు.

మీడియా ప్రతినిధుల హడావుడి.

స్టీవెన్ స్పీల్ బర్గ్ తో బాలీవుడ్ ప్రముఖులు.

స్టీవెన్ స్పీల్ బర్గ్ తో బాలీవుడ్ ప్రముఖులు.

స్టీవెన్ స్పీల్ బర్గ్ తో అనిల్ అంబానీ, అమితాబ్ బచ్చన్.


Click it and Unblock the Notifications











