OG సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా.. అలంటి పాత్రలో స్టన్ అయ్యేలా..?
బాలీవుడ్ మెగాస్టార్ అంటే బిగ్ బి అమితాబచ్చన్ అని ఎవరైనా చెబుతారు. ఈ మధ్యకాలంలో అమితాబచ్చన్ కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబచ్చన్ నటించారు. మెగాస్టార్ చిరంజీవి గురువుగా ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె మూవీలో అమితాబచ్చన్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో గురువు పాత్రలో అమితాబచ్చన్ కనిపించబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రం సిద్ధం అవుతోంది.

భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో కూడా అయన జాయిన్ అయ్యారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు బిగ్ బి అమితాబచ్చన్ ని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర కోసం సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.
ఒక వేళ అమితాబచ్చన్ ఈ మూవీలో చేయడానికి ఒప్పుకుంటే అతనికిది మూడో తెలుగు మూవీ అవ్వనుంది. సాహోతో బాలీవుడ్ దృష్టిని సుజిత్ ఆకర్షించారు. ఈ నేపథ్యంలో అమితాబచ్చన్ ఈ మూవీలో నటించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం కూడా ఒక కారణంగా చూపించవచ్చు. త్వరలో దీనికి సంబందించి అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. మొదటి విడతలో భాగంగా పది నియోజకవర్గాలలో తిరుగుతున్నారు. ఈ యాత్ర పూర్తయిన తర్వాత మరల ఓజీ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. అయితే షూటింగ్ హైదరాబాద్ లో జరగనుందా లేదంటే అమరావతిలో ప్రత్యేకంగా సెట్స్ వేసి షూట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











