అమితాబ్ కి ప్రక్కటెముకల్లో ప్రాక్చర్
రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్' షూటింగ్ సందర్భంగా లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయాల గురించి ఆయన బ్లాగ్ లో రాసుకున్నారు. తన పక్కటెముకలలో చిన్న ఫ్రాక్చర్ అంటే పగులుచూపటం జరిగిందని ఆయన చెప్పారు. ఒక యాక్షన్ దృశ్యం చిత్రీకరణ సందర్భంగా ఆయన గాయపడ్డారు. రెండు రోజులు విరామం ఇచ్చి బచ్చన్(68) మరల చురుకుగా నటిస్తున్నారు. శనివారం ఉదయం డాక్టర్ సలహామేరకు ఎక్స్‌రే తీయించుకుంటే ఈ విషయం బైటపడిందని ఆయన తన బ్లాగ్‌లో రాసుకున్నారు. కాని ఆ పగులు చిన్నదేనని చెప్పారు. ఇందుకు మందులేదని కనీసం నెలరోజులు ఓర్చుకోవలసిందేనని రాశారు. ఈ పగులు దానంతట అదే పూడాలని డాక్టర్లు చెప్పారన్నారు. అందువల్ల చేసేదేమీ లేదని అనుభవించాల్సిందేనని చెప్పుకొచ్చారు. మొన్నా మధ్య ఈ చిత్రం షూటింగులో హీరో రాణా దగ్గుబాటి గాయపడి, వారం రోజులు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











